
ముంబైకు చెందిన ఇరవై ఆరేళ్ల జబ్బీర్ అలీ తన ఖరీదైన మెర్సిడెజ్ బెంజ్ కారు నడుపుతూ, ‘పోకెమాన్’ ఆడుతూ ప్రమాదానికి గురయ్యాడు. ఒక ఆటో వేగంగా వచ్చి ఢీ కొట్టడంతో కారు దెబ్బతింది. దీంతో కారు గ్యారేజ్ కు వెళ్ళడం… 20 వేల బిల్లు వదలడం కూడా జరిగిందని స్వయంగా జబ్బీర్ తన సోషల్ మీడియా పోస్ట్ లో వేడుకగా వెల్లడించాడు.
తన కారులో ఇంటికి వెళ్లే సమయంలో ఈ గేమ్ ఆడానని, మొదటిసారే ఇంత నష్టం తెచ్చిందని ప్రజలకు అవగాహన కల్పించే నిమిత్తం తన ఫొటోను సోషల్ మీడియాలో పెట్టానని చెప్పాడు. కారు నడుపుతూ, ‘పోకేమాన్’ గేమ్ ఆడటం వల్ల తనకు వచ్చిన ప్రతిఫలం ఇదీ అంటూ తన దెబ్బతిన్న కారు ఫొటోను పోస్ట్ చేశాడు. కాగా, ముంబైలో ‘పోకేమాన్’ నమోదు చేసిన తొలి యాక్సిడెంట్ ఇదే కావడంతో పోలీసులు రంగంలోకి దిగారు.
Karthi is returning to the silver screen with the highly anticipated spy thriller Sardar 2,…
Directed by Venu Gopal Reddy, Romanchakam features Sumanth Prabhas and Ananthika Sanilkumar in the lead…