Telugu

అమరావతి వద్దనుకున్నప్పుడు అక్కడి ఓట్లు కూడా వద్దనాలి కదా?

నాడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఐదేళ్ళు రాష్ట్రాన్ని పాలించినప్పుడు ఆయన వైఖరి వలన ‘ఆంధ్రప్రదేశ్‌ రాజధాని ఏది?” అనే ప్రశ్నకు జవాబు చెప్పలేక ప్రజలు సిగ్గుతో తలదించుకునేవారు. వైసీపీ నేతలకు కూడా ఈ ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోయేవారు. కానీ అందుకు సిగ్గుపడిన దాఖలాలు లేవు.

ఈ ఫ్లాష్ బ్యాక్ స్టోరీ ఇప్పుడు అనవసరమే. కానీ అమరావతి పట్ల జగన్‌ వైఖరి ఇప్పుడు జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా.. ముఖ్యంగా మంగళగిరి-తాడేపల్లి పట్టణాలను కలిపి ఏర్పాటు చేసిన ‘ఎంటీఎంసీ’ నగరపాలక సంస్థ ఎన్నికల్లో కూడా వైసీపీ అభ్యర్ధుల పాలిట శాపంగా మారుతున్నాయి.

ADVERTISEMENT

వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అమరావతిని పాడు బెట్టేసింది. రాజధానికి భూములిచ్చిన రైతులను గౌరవించకపోగా వారి పట్ల చాలా దారుణంగా వ్యవహరించారు.

వారినీ, రాజధాని నిర్మిస్తున్న సీఎం చంద్రబాబు నాయుడుని ద్వేషించడంతో సరిపెట్టుకోలేదు. చివరకి అమరావతిని శ్మశానం, వేశ్యల రాజధాని, కమ్మరావతి, భ్రమరావతి అంటూ నోరు లేని నేలతల్లిని కూడా అవహేళన చేశారు. తత్ఫలితంగా శాసనసభ ఎన్నికల్లో మంగళగిరితో సహా రాజధాని ప్రాంతాలలో వైసీపీ అభ్యర్ధులు ఓడిపోయారు.

కానీ నేటికీ జగన్‌ అమరావతిని వ్యతిరేకిస్తూనే ఉన్నారు. తాను అధికారంలోకి వస్తే ‘మావిగన్‌’ రాజధానిగా ఉంటుందని చెప్పారు.

కనుక నాడు అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించిన తీరు, నేటికీ అమరావతి పట్ల ఆయన ప్రదర్శిస్తున్న ఈ వ్యతిరేకత ‘ఎంటీఎంసీ’ నగరపాలక సంస్థ ఎన్నికల్లో వైసీపీ కౌన్సిలర్లు, మేయర్‌గా పోటీ చేస్తున్న వైసీపీ అభ్యర్ధి పున్నా నాయక్ పాలిట శాపంగా మారాయి.

అమరావతిని వ్యతిరేకిస్తూ ఓట్లు ఎలా అడుగుతారని స్థానిక ప్రజలు నిలదీస్తున్నట్లు సమాచారం. మరికొందరు వైసీపీ హయంలో రాజధాని రైతుల పట్ల జగన్‌ ప్రభుత్వం వ్యవహరించిన తీరుని గుర్తుచేసి నిలదీస్తుంటే మరికొందరు వైసీపీ హయంలో అమరావతిని పాడుబెట్టేసి, ఇప్పుడు అధికారంలో లేనప్పుడు అభివృద్ధి చేస్తామని చెప్తే ఎలా నమ్ముతాం?అని మొహం మీదనే అడుగుతున్నట్లు తెలుస్తోంది.

బహుశః కర్నూలు (న్యాయరాజధాని), విశాఖ (ఆర్ధిక రాజధాని)లో కూడా వైసీపీ అభ్యర్ధులకు ఇలాంటి ప్రశ్నలే ఎదురై ఉండవచ్చు.

నేటికీ ‘అమరావతి వద్దు మావిగన్‌ ముద్దు’ అని జగన్‌ అంటున్నందున, 2029 శాసనసభ ఎన్నికల్లో కూడా వైసీపీలకు ఇదే ప్రశ్న వినిపించకుండా ఉంటుందా?అప్పుడు ప్రజలకు ఏమని సమాధానం చెప్పుకుంటారు?ఏవిధంగా నచ్చజెప్పుకుంటారు?ఇప్పటి నుంచే ఆలోచించుకుని సమాధానం సిద్ధం చేసుకుంటే మంచిది.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Recent Posts

NTR Rescued Trivikram Once. Can He Do It Again?

A director's failure should not make people forget his talent. NTR made this point strongly…

24 minutes ago

Karthika Deepam Row: Supreme Court Order vs Vijay Government

The Karthika Deepam controversy at Thiruparankundram Hill in Tamil Nadu has turned into a major…

55 minutes ago