
గత ప్రభుత్వాలు టెట్రా ప్యాకింగ్ రూపంలో ఈ పాలను పిల్లలకు అందించే వారన్న లోకేష్, నేడు జగన్ ఏమో తన ఫొటోలతో పాలిథిన్ పౌచ్ లలో సరఫరా చేస్తున్నారని, ఇది పిల్లల ఆరోగ్యాన్ని దెబ్బ తీసే అంశంగా లోకేష్ పేర్కొన్నారు. ఈ ట్వీట్ లో పోస్ట్ చేసిన వీడియోలో ఆ పాలిథిన్ పౌచ్ లు ఉబ్బిపోయి ఉండడం గమనించదగ్గ విషయం.
“జగన్ ప్రచార ఆర్భాటాలకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తుందని, రక్తం రుచి మరిగిన మృగానికి – అడ్డగోలు సంపాదనకు అలవాటు పడిన జగన్ రెడ్డికి పెద్ద తేడా లేదని” లోకేష్ ధ్వజమెత్తారు. జె-బ్రాండ్లతో మహిళల తాళిబొట్లు తెంచుకున్న సైకో జగన్ అవినీతి దాహం పసిపిల్లకిచ్చే పాలను కాలకూట విషంగా మారుస్తున్నారని మండిపడ్డారు.
దీనికి సోషల్ మీడియా నుండి కూడా భారీ ఎత్తున మద్దతు లభిస్తోంది. ప్రభుత్వాలు ప్రచారం చేసుకోవడం సహజమే గానీ, మరీ పసిపిల్లలకు ఇచ్చే పాల విషయంలో కూడా కక్కుర్తి పడడం అనేది జగన్ ఆలోచనలు ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. నిజానికి ఈ ప్రచారాల కోసమే గత నాలుగేళ్లుగా కొన్ని వేల కోట్ల రూపాయలను జగన్ ఖర్చు చేస్తున్నారు.
The original uncut version of Obsession is scheduled to premiere on JioHotstar on October 30.…
BOTTOM LINE History Without Heart RATING 2/5 Story, Screenplay, Director: Rahul Sankrityan Cast: Vijay Deverakonda,…