
YS Jagan Mohan Reddy assets cases hearing
వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి సంబంధించిన అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.
తెలంగాణ హైకోర్టులో ఈడీ వేసిన పిటిషన్ నేపథ్యంలో ఈ కేసుల విచారణను వేగవంతం చేసేందుకు నాంపల్లిలోని సీబీఐ ప్రత్యేక కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది.
ఇప్పటివరకు సీబీఐ నమోదు చేసిన కేసులపైనే రోజువారీ విచారణ జరుపుతున్న న్యాయస్థానం, ఇకపై ఈడీ నమోదు చేసిన కేసులను కూడా రోజువారీగా విచారించాలని నిర్ణయించింది.
ఇటీవల ఈడీ తరపు న్యాయవాదులు రోజువారీ విచారణ కోసం హైకోర్టును ఆశ్రయించినప్పుడు వైసీపీ స్పందన చాలా విచిత్రంగా ఉంది.
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆడమన్నట్లే ఈడీ అధికారులు ఆడుతున్నారని, జగన్‌పై రాజకీయ కక్ష సాధించడానికే ఆయన ఆదేశాల మేరకు ఈడీ అధికారులు ఈవిధంగా వ్యవహరిస్తున్నారని వైసీపీ ఆరోపించింది.
అయితే పదేళ్లుగా ఈ అక్రమాస్తుల కేసుల విచారణ ఎందుకు ముందుకు సాగడం లేదు? అంటే చట్టం తన పని తాను చేసుకుపోతుండటం వల్లనే కదా?
వివేకా హత్య కేసులో కూడా చట్టం తన పని తాను చేసుకుపోతుండటం వల్లనే దాదాపు ఏడేళ్లుగా విచారణ కొనసాగుతోంది.
ప్రస్తుతం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ మద్యం కుంభకోణం, మద్యం రవాణా కుంభకోణం కేసుల్లోనూ చట్టం తన పని తాను చేసుకుపోతుందని చెబుతున్నారు తప్ప తొందర పడటం లేదు.
జగన్‌కు సంబంధించిన మనీలాండరింగ్ కేసుల్లో దర్యాప్తు సంస్థలు ఇప్పటికే పలు ఆధారాలు సేకరించాయి. అయినప్పటికీ దాదాపు పదేళ్లుగా ఈడీ కేసుల విచారణ ముందుకు సాగకపోవడంతో ఆ సంస్థ హైకోర్టును ఆశ్రయించింది. కేసుల విచారణను వేగవంతం చేయాలని కోరింది.
ఈ కేసుల నుంచి తమ అధినేత జగన్‌మోహన్ రెడ్డి కడిగిన ముత్యంలా బయటపడతారని, త్వరగా విచారణ పూర్తి కావాలని వైసీపీ కోరుకుంటున్నప్పుడు మళ్లీ సీఎం చంద్రబాబు నాయుడిని, ఈడీ, సీబీఐలను నిందించడం దేనికి?
ఓ పక్క న్యాయవ్యవస్థపై తమకు అపారమైన నమ్మకం ఉందని వైసీపీ నేతలు చెబుతుంటారు! కనుక చట్టం తన పని తాను చేసుకుపోతున్నప్పుడు ఎవరూ ఆవేశపడాల్సిన అవసరం లేదు. అలాగే ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం కూడా లేదు.
A trip to the US for her son's birthday turned into a costly experience for…
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన రాప్తాడు ఘటనలో నిందితుడు హేమంత్‌ను ఈరోజు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అవడంతో పోలీసులు అనంతపురం…