
సాధారణంగా గంగ, కృష్ణ, గోదావరి, తుంగభద్ర, యమునా…ఇలా అనేక నదులకు ప్రతి పన్నెండేళ్లకు ఒకసారి పుష్కరాల వేడుకలు జరుగుతుంటాయి. అయితే ఇప్పుడు ఆ పుష్కరాల సంబరాలకు వైసీపీ కూడా సన్నద్ధమయినట్టేనా.? అంటూ సోషల్ మీడియాలో జగన్ బెయిలు మీద చర్చ జరుగుతుంది.
అయితే అసలు విషయానికొస్తే., అక్రమ ఆస్తుల కేసులో అరెస్టై దాదాపు 16 నెలలు జైలుకెళ్లిన వైస్ జగన్ మోహన్ రెడ్డి బెయిలు మీద బయటకొచ్చి నేటితో పుష్కర కాలం గడిచింది. సరిగ్గా 2013 సెప్టెంబర్ 24 న బైలు మీద బయటకొచ్చిన వైస్ జగన్ నేటికీ అదే బెయిలు మీద రాజకీయం చేస్తున్నారు.
అయితే నాడు భారీ బలప్రదర్శనతో బైలు మీద బయటకొచ్చిన వైస్ జగన్ తన వెంట అనేక షరతులను తెచ్చుకున్నారు. ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరయ్యి కేసు విచారణకు సహకరించాలని, న్యాయస్థానాల అనుమతి లేకుండా దేశం దాటి వెళ్లకూడదని ఇలా పలు షరతులను వెంటతెచ్చుకున్న వైస్ జగన్ వాటిలో కొన్నిటిని కాగితాలకే పరిమితం చేసారు.
గత ఐదేళ్లు రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను చాల బిజీ అంటూ ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్లే తంతును నేటికీ పులివెందుల ఎమ్మెల్యే గా వాయిదాలతో నెట్టుకొస్తున్నారు జగన్. ఇక కేసు విచారణను చేపట్టిన సీబీఐ తన దర్యాప్తును వేగవంతం చేయడం అటువుంచితే కనీసం జగన్ ను వారం వారం కోర్టుకు కూడా రప్పించలేకపోతుంది.
అయితే నాడు కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మొదలైన జగన్ అక్రమాస్తుల కేసు నేడు బీజేపీ అధికారంలోకి వచ్చినా ఇన్నాళ్ళుగా వేసిన గొంగళి వేసినట్టే అన్నట్టుగా ముందుకు సాగకపోవడానికి బీజేపీ తో వైసీపీ కి ఉన్న అక్రమ స్నేహమే కారణం అనేది ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో వినిపించే అభిప్రాయం.
అయితే వైసీపీ ఈ జగన్ బెయిలు పుష్కరాల వేడుకలు గాన నిర్వహిస్తే అందుకు ముఖ్య అతిథులుగా బీజేపీ అధిష్ఠాన నాయకులను ఆహ్వానిస్తే అప్పుడు వైసీపీ, బీజేపీ ఋణం తీర్చుకున్నట్టు అవుతుందేమో బహుశా..!
Aniesh made a good impression with his performance in the songs and teaser of Itllu…
Tom Cruise can still make audiences run to theatres, but it seems they need a…