
ఏపీలో వైసీపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి అప్పుడే నాలుగున్నరేళ్ళయింది. మరో 4 నెలల్లో శాసనసభ, లోక్‌సభ ఎన్నికలు జరుగబోతున్నాయి. నాలుగున్నరేళ్ళుగా ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఈయకుండా కాలక్షేపం చేసేసిన వైసీపి ప్రభుత్వం ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడుతుండగా గ్రూప్-2లో 897 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. దీనిని బట్టి కేసీఆర్ ప్రభుత్వంలాగే జగన్ ప్రభుత్వం కూడా ఈ ఉద్యోగాల భర్తీని ఎన్నికల తాయిలంగా ఉపయోగించుకోవాలని అనుకొంటోందని అర్దమవుతోంది.
కేసీఆర్ ప్రభుత్వం సుమారు రెండున్నరేళ్ళ క్రితం ఈ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ మొదలుపెట్టింది. మద్యలో కోర్టు కేసులు, ఉద్యోగుల బదిలీలు, పదోన్నతులు, టిఎస్‌పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజి, పరీక్షల రద్దు, వాయిదాలు, కేసులు, విచారణ అంటూ చాలా డ్రామాలే సాగాయి.
వాటితో ఎన్నికల వరకు సాగదీయగలిగింది. తద్వారా ఈ ఉద్యోగాల భర్తీని కేసీఆర్ బిఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా మలుచుకోవాలనుకొన్నారు. కానీ ఈ డ్రామాలే బిఆర్ఎస్ కొంప ముంచాయి.
కేసీఆర్ ప్రభుత్వం రెండున్నరేళ్ళ క్రితం మొదలుపెట్టినా ఈ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ఇంకా పూర్తిచేయలేనప్పుడు వైసీపి ప్రభుత్వం ఎన్నికలకు 4 నెలల ముందు జాబ్ నోటిఫికేషన్ ఇస్తే ఏవిదంగా పూర్తిచేయగలదు?అని ఆలోచిస్తే పూర్తికాదనే అర్దమవుతోంది.
ఈ గ్రూప్-2 ఉద్యోగాల కోసం జనవరి 10వరకు దరఖాస్తుల స్వీకరించి ఫిబ్రవరి 25న ప్రిలిమ్స్ నిర్వహిస్తారట! మార్చిలో వాటి ఫలితాలు వెల్లడించినా అప్పటికి ఎన్నికల షెడ్యూల్ వచ్చేస్తుంది. కనుక ఎన్నికల కోడ్ అమలులోకి వస్తుంది. దాంతో ఈ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ వాయిదా పడుతుంది.
అంటే దీనిని ఎన్నికలలో తాయిలంలా వాడుకోవాలనే యావే తప్ప ఉద్యోగాల భర్తీ చేయాలనే చిత్తశుద్ధి లేదని అర్దమవుతోంది. ఒకవేళ ఉండి ఉంటే, నాలుగున్నరేళ్ళుగా చేతులు ముడుచుకొని కూర్చోనేదే కాదు కదా?
విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ శాసనసభలో గొప్పగా మెగా డీఎస్సీ తీస్తామని చెప్పి ఆరునెలలు పైనే అయ్యింది. బహుశః దానికీ ఇప్పుడు ముహూర్తం పెడతారేమో?ఎందుకంటే ఎన్నికల తర్వాత మళ్ళీ అధికారంలోకి వస్తామో రామో వైసిపిలో ఎవరికీ తెలీదు కనుక నోటిఫికేషన్స్ పేరుతో ఓ రాయి విసిరి చూద్దామని ప్రయత్నిస్తున్నట్లు ఉంది. ఎన్నికల ప్రచారంలో వైసీపిని మళ్ళీ గెలిపిస్తే ఉద్యోగాల భర్తీ చేస్తామని చెప్పుకోవడం ఖాయం.
కానీ నిరుద్యోగులతో గేమ్స్ ఆడినందుకే వారు ఆయనను గద్దె దించేశారు. జగన్ ప్రభుత్వం కూడా అదేవిదంగా ఈ గ్రూప్-2తో నిరుద్యోగులతో ఆట మొదలుపెట్టింది కనుక ఇక్కడా అదే జరుగవచ్చు.
Drishyam 3 actress Shriya Saran has opened up about being a victim of AI-morphed photos.…
During his recent interview, popular distributor Tirupur Subramaniam criticised Yash's recently released film Toxic and…