
Jagan and BRS Remarks on Chandrababu Rainfall
ఎల్‌నినో ప్రభావం వలన రెండు తెలుగు రాష్ట్రాలలో వర్షాభావ పరిస్థితి ఏర్పడితే, ఇక్కడ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి, అక్కడ బీఆర్ఎస్ పార్టీ నేతలు ఏపీ సిఎం చంద్రబాబు నాయుడినే నిందిస్తున్నారు. వారికి ఇదొక దురలవాటుగా మారిపోయింది.
వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా ఎల్‌నినోని చంద్రబాబు నాయుడుకి అంటగట్టి పైశాచికానందం పొందుతున్నారు. కానీ దేవుడి స్క్రిప్ట్ ఎప్పుడూ వేరేగానే ఉంటోంది.
నిన్న ఉదయం నుంచి రాష్ట్రంలో పలు జిల్లాలలో ఏకధాటిగా భారీ వర్షం కురుస్తూనే ఉంది. విజయవాడ, విశాఖతో సహా పలు నగరాలు, పట్టణాలు, పల్లెలు అతలాకుతలం అవుతున్నాయి. వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి.
అయితే దీనికీ వైసీపీ ‘మరో వెర్షన్’ సిద్ధంగానే ఉంచుకుంది. విశాఖ, విజయవాడ వంటి నగరాలే మునిగిపోతుంటే అమరావతి పరిస్థితి ఏమిటి? అంటూ మొసలి కన్నీళ్ళు కార్చడం మొదలుపెట్టింది.
అమరావతి సంగతి ప్రభుత్వం చూసుకుంటుంది. కానీ చంద్రబాబు నాయుడు సిఎం అయితే వర్షాలు పడక కరువు తాండవిస్తుందంటూ నిరంతరంగా దుష్ప్రచారం చేస్తున్న వైసీపీ, ఈ వర్షాలను, వాటితో రాష్ట్రామంతా పొంగిపొరలుతున్న వాగులు, వంకలను ఎవరి పద్దులో రాస్తుంది?
తెలంగాణ నీళ్ళను చంద్రబాబు నాయుడు ఎత్తుకుపోతున్నాడంటూ నిత్యం ఆయనని నిందిస్తున్న బీఆర్ఎస్ నేతలు, ఇప్పడు తెలంగాణని ముంచెత్తుతున్న వరద నీటిని నిలువచేసి వాడుకోగలరా? ఆ వరద నీరు దిగువనున్న ఆంధ్రాలోకి ప్రవహించకుండా మళ్ళించుకోగలరా? ఆ నీరు ఆంధ్రాలో పలు ప్రాంతాలను ముంచెత్తుతుండటం వలన కలిగే నష్టాన్ని భర్తీ చేస్తారా? అంటే కాదనే తెలుసు.
కానీ ఈ వరద నీటిని వాడుకోలేక చేతులెత్తేసినవారు, సిఎం చంద్రబాబు నాయుడు ఆ నీటిని వివిధ ప్రాజెక్టుల ద్వారా అటు సీమ జిల్లాలకు, ఇటు కృష్ణా డెల్టా, ఉత్తరాంధ్ర జిల్లాలను అందిస్తుండటం చూసయినా ఏమీ నేర్చుకోవడం లేదు.
కృష్ణా, గోదావరి వరద నీటి విలువ తెలియనివారు కూడా సిఎం చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు.
ఆకాశం మీద ఉమ్మేస్తే అది ఆకాశం మీద పడదు తిరిగి మన మొహం మీదే పడుతుందని ఎప్పటికి తెలుసుకుంటారో?
Radhika Apte is trending as she opened up about the consequences that have lately emerged…
Sankranti 2027 is shaping up to be a busy season for Sharwa, who is gearing…