వైసీపీ రాకతో ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖచిత్రం కులాల రొంపులో, మతాల మంటలలో నలిగిపోతూ ‘రాజకీయం’ అనే పదానికి అర్దాన్ని మార్చేశాయి. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో ముఖ్యమంత్రిగా ఉన్న వైస్ జగన్ ఏకంగా ఒక సామాజికవర్గం మీద ఉన్న కక్షతో రాష్ట్ర రాజధానినే మార్చేశారు.
అలాగే ఒక రాష్ట్ర అధిపతిగా ఉంటూ చంద్రబాబు సామజిక వర్గం మీద పదేపదే విషం కక్కుతూ ఆ విషాన్ని మీడియాకు, న్యాయాధిపతులను కూడా ఆపాదించారు. ఇక ఏపీ రాజధాని అమరావతిని ‘కమ్మ,రావతి అంటూ ప్రచారం చేస్తూ వైసీపీ రెక్కలతో రాష్ట్ర భవిష్యత్ ను అంధకారంలోకి నెట్టారు.
వైసీపీ ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా న్యాయస్థానాలు తీర్పులు ప్రకటిస్తే దానికి కమ్మ కులానికి ఆపాదించి బాబు కోసమే సదరు న్యాయమూర్తి ‘కమ్మ’నైన తీర్పునిచ్చారు అంటూ ప్రచారం చేసుకున్నారు. అలాగే రాష్ట్ర పోలీస్ వ్యవస్థలో ఉన్న ఉన్నతాధికారులను కూడా ఈ కమ్మ కులం పేరుతో వేధించిన వైనాలు కోకొల్లలు.
ఇక చివరికి ఆ ఏడుకొండల తిరుమలేశుడికి కూడా కులాన్ని ఆపాదిందించి దేవత్వానికి కూడా గోవింద చెప్పిన వైసీపీ రాజకీయం ఇప్పటికి అదే తీరులో నడుస్తుంది. నాడు అధికారంలో ఉన్నంత కాలం బాబు మీద ఉన్న రాజకీయ కక్షతో, టీడీపీ మీద పదవి పగతో కమ్మ సామజిక వర్గం మీద రాజకీయ కక్ష సాధించిన వైస్ జగన్, నేడు అధికారం చేజారగానే అదే సామజిక వర్గం మీద కమ్మనైన ప్రేమ కురిపిస్తున్నారు.
బాబు తన సామిజిక వర్గం నుంచి రాజకీయంగా ఎవరిని నాయకుడిగా ఎదగనివ్వడని, కమ్మ సామజిక వర్గానికి తను, తన కొడుకు లోకేష్ మాత్రమే వారసులుగా, నాయకులుగా ఉండాలని, దాని కోసం సొంత సామజిక వర్గం నేతల మీద కూడా కేసులు మోపి అరెస్టులు చేయిస్తారంటూ వంశీ అరెస్టు విషయాన్ని లేవనెత్తి కమ్మ కులం మీద వల్లమాలిన ప్రేమ చూపిస్తున్నారు జగన్.
అయితే జగన్ చేసే ఈ కమ్మనైన వ్యాఖ్యలతో జగన్ కు ఒరిగేది, వైసీపీ కి కలిసొచ్చేది ఏమి ఉండదని, గత ఐదేళ్లు వైసీపీ చేసిన దారుణాలు, జగన్ ఆధ్వర్యంలో జరిగిన అరాచకాలు ఇంకా ఆ సామాజికవర్గం ప్రజలలో నిప్పులు కురిపిస్తూనే ఉన్నాయనేది జగమెరిగిన సత్యమే. అయినా కూడా జగన్ ఇటువంటి వ్యాఖ్యలు చేయడం ఆయన రాజకీయ పరిధి కులాన్ని దాటి ఆలోచించలేనిదని నిరూపించింది.
అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ ని టార్గెట్ చేస్తూ వల్లభనేని వంశీ, కొడాలి నాని, దేవినేని అవినాష్ విషయంలో జగన్ చేసిన ఈ కమ్మనైన వ్యాఖ్యలు కమ్మ వారిని ఆకర్షిస్తాయా.? జగన్ ఊసరవెల్లి మాదిరి ఈ రకంగా ఓసారి కమ్మ వారి ఎదుగుదలకు బాబు వ్యతిరేకం అంటూనే మరోసారి కమ్మవారికి ప్రయోజనం చేకూర్చడానికే బాబు ప్రయత్నాలు అనడాన్ని జగన్ అవివేకమనాలా.? లేక రాజకీయ మూర్కత్వమనలా.?




