
ప్రస్తుతం భారతదేశంలో కాక్రోచ్ కేంద్రంగా జరుగుతున్న రాజకీయం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ప్రశ్న పాత్రల లీకేజ్ తో నీట్ పరీక్ష రద్దు కారణంగా కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్న బీజేపీ కి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ‘కాక్రోచ్ జనతా పార్టీ’ పుట్టుకొచ్చింది.
అయితే పార్టీ పేరుతోనే సోషల్ మీడియాలో సంచలనం సృష్టించిన కాక్రోచ్ జనతా పార్టీ కేంద్ర బీజేపీ కి వ్యతిరేకంగా పోరాటం చేస్తుంది. అయితే అచ్చంగా ఏపీలో కూడా ఇదే తరహాలో వైసీపీ కూడా తన పార్టీ కూడా కాక్రోచ్ లాంటిదే అంటూ ప్రకటించింది.
ఏడాది కిందట ఏపీలో జరిగిన మెగా డిఎస్సి, దాని ఫలితంగా అభ్యర్థులకు వచ్చిన ఉద్యోగాలు అక్రమంటూ, ఈ అపరిక్షలో కూడా కూటమి ప్రభుత్వం అవకతవకలు పాల్పడిందంటూ నేడు జగన్ తన తాడేపల్లి ప్యాలస్ లో రెండు గంటల పాటు సుదీర్ఘ ప్రెస్ మీట్ నిర్వహించారు. అందులో భాగంగా ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ ఏపీలో కూడా కాక్రోచ్లు రోడ్ల మీదకొస్తాయన్నారు.
అయితే జగన్ ప్రకటించిన ఈ కాక్రోచ్ లు కేవలం టీడీపీ, జనసేన టార్గెట్ గా మాత్రమే ముందుకెళ్తాయి. కాక్రోచ్ జనతా పార్టీ మాదిరి వైసీపీ కాక్రోచ్ లు బీజేపీ ని టార్గెట్ చేయవు. ఎందుకంటే జగన్ చెప్పే కాక్రోచ్ లకు కేంద్రంలో అధికారం ఉన్న బీజేపీ అంటే భయమైనా ఉండుండాలి, లేదా భక్తయినా అయ్యుండాలి.
నీట్ పేపర్ లీకు మీద కనీసం నోరెత్తలేని వైసీపీ, ఏపీలో నీట్ పరీక్ష రద్దు వలన నష్టపోయిన విద్యార్థులకు ఎం సమాధానం చెపుతుంది.? ఎన్డీయే లో భాగం కావడం వల్ల టీడీపీ, జనసేన ప్రేక్షక పాత్ర వహించినప్పటికీ వై వైసీపీ సైలెంట్.? అనే ప్రశ్నకు జగన్ బదులు చెప్పగలరా.?
జగన్ చెప్పే కాక్రోచ్ ల నిర్బంధానికి, నిర్ములనకు బీజేపీ వద్ద జగన్ అక్రమాస్తుల కేసులు అనే ‘HIT’ వాక్సిన్ ఉందా.? అందుకే వైసీపీ కాక్రోచ్ లు బీజేపీ పై కన్నెర్ర చేయలేకపోతుందా.? నోరెత్తి విమర్శించలేకపోతుందా.? పార్టీలందు వైసీపీ పార్టీ వేరయా అనేలా కాక్రోచ్ ల యందు జగన్ చూపిన వైసీపీ కాక్రోచ్ లు కూడా వేరేనా.?
“గుర్తుపెట్టుకో చంద్రబాబు…”
“ఆంధ్రప్రదేశ్లో మేమూ కాక్రోచెస్మే!”
ఇది Gen Z టైమ్… Alpha Generation కూడా వచ్చేసింది@ysjagan pic.twitter.com/raCouqxl5g
— M9 NEWS (@M9News_) June 11, 2026
Venkatesh’s much-hyped Aadarsha Kutumbam AK 47, directed by Trivikram, has been indefinitely postponed. Producer Naga…
The Ministry of External Affairs in India has amended the passport rules for minors of…