
పోలీస్ అధికారుల బట్టలూడతీస్తా, వారు ఏడూ సముద్రాల అవతల ఉన్న పట్టుకొస్తా, రిటైర్ అయినా వదిలేదెలేదు అంటూ పోలీస్ ఉన్నతాధికారుల పై నానా హంగామా చేసిన మాజీ ముఖ్యమంత్రి వైస్ జగన్ తానూ తిరిగి అధికారంలోకి రాకుండానే ఇచ్చిన మాటను, చేసిన హెచ్చరికలను ఒక్కొక్కటిగా నిలుపుకుంటున్నారు.
అదెలా సాధ్యమా అనుకుంటే, ఇప్పుడు ఏపీలో తాజాగా జరుగుతున్న పోలీస్ అధికారుల అరెస్టులే అందుకు ప్రత్యక్ష నిదర్శనం గా కనిపిస్తున్నాయి. ముంబై నటి జిత్వాని కేసులో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో చట్టాన్ని అతిక్రమించి వ్యవహరించిన ముగ్గురు ఐపీఎస్ అధికారుల పై కూటమి ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది.
దీనితో పీఎస్ఆర్ ఆంజనేయులు, కాంతి రాణా టాటా, విశాల్ గున్ని వంటి పోలీస్ ఉన్నతాధికారులు వారి విధులకు దూరం కావడంతో పాటుగా వారి కాకి బట్టలకు దూరమయ్యాయి. అయితే దీనికంతటికి పరోక్షంగా మాజీ ముఖ్యమంత్రి వైస్ జగన్ మోహన్ రెడ్డే బాధ్యుడు కావడంతో జగన్ తానూ హెచ్చరించినట్టుగా పోలీస్ అధికారుల బట్టలు ఊడదీసేసారు గా అంటూ సోషల్ మీడియాలో జగన్ పై కౌంటర్లు పేలుతున్నాయి.
ఇక ఈ కేసు విషయంలో రంగంలోకి దిగిన సిఐడి అధికారుల విచారణతో సస్పెన్షన్ కు గురైన ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయుల అరెస్టు, ఆ తరువాత రిమాండ్ ఇలా చట్టం తన పని తానూ చెకచెకా చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఇక రేపోమాపో ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన మరో ఇద్దరు ఐపీఎస్ అధికారులు కాంతి రాణా, విశాల్ గున్ని పై కూడా సిఐడి విచారణకు రంగం సిద్ధం చేసినట్టు వార్తలొస్తున్నాయి.
దీనితో వ్యక్తిని నమ్మి వ్యవస్థను పక్కదారి పట్టించి, చట్టాన్ని అతిక్రమించిన ప్రతి ఒక్కరికి ఈ ముగ్గురు ఐపీఎస్ ల ఉదాంతం ఒక చక్కటి గుణపాఠం కానుంది అనే అభిప్రాయం సర్వత్రా వినిపిస్తుంది. అటువంటి అధికారులు సస్పెండ్ అయినా, అప్రూవల్ గా మారినా వారిని చట్టం ముందు దోషులుగా ప్రజల ముందు అవినీతిపరులుగా నిలబెట్టిన ఘనత మాత్రం ఒక్క జగన్ కే దక్కుతుంది అంటున్నారు కూటమి నేతలు .
గతంలో కూడా ఇదే మాదిరి జగన్ ను నమ్మి శ్రీ లక్ష్మి అనే ఐఏఎస్ అధికారి కటకటాలపాలయ్యారు. ఇప్పుడు ఆంజనేయులు కూడా నాటి తన దుశ్చర్యలకు నేడు మూల్యం చెల్లిస్తున్నారు. అలాగే వైసీపీ మద్దతుదారుడు బోరుగడ్డ అనిల్ విషయంలో పోలీస్ అధికారులు వ్యవహరించిన తీరుతో కొంతమంది పోలీస్ కానిస్టేబుల్స్ లను ప్రభుత్వం విధుల నుంచి తొలగించింది.
ఇక వైస్ భారతి పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను అరెస్టయిన టీడీపీ కార్యకర్త కిరణ్ విషయంలో వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ చేసిన చర్యలతో మరికొంతమంది పోలీస్ అధికారులు వారి కాకి బట్టలకు దూరం కావాల్సి వచ్చింది. అయితే వీటికన్నిటికి ప్రత్యక్షంగా ఎవరు కారకులయినప్పటికీ వైసీపీ నేతల దుస్సాహసాలకు, పోలీస్ అధికారుల దుస్థితికి మాత్రం పరోక్ష కారకుడు వైస్ జగన్ మోహన్ రెడ్డే కావడం విశేషం.
Tollywood’s December release race is getting more interesting, with Nithiin’s Alias Rukmini joining the December…
Vijay’s son Jason Sanjay chose to make his entry into films as a director rather…