ఆర్జీవీ కోసం జగన్ లాయర్లు.! అర్ధమవుతుందా?

వివేకానందా రెడ్డి హత్య కేసులో ఆమె కుమార్తె సునీతా రెడ్డి తరుపున న్యాయస్థానాలలో వాదన వినిపిస్తూన్నారు సిద్దార్ద్ లూథ్రా అనే ప్రముఖ సీనియర్ న్యాయవాది. అయితే ఇదే వ్యక్తి చంద్రబాబు స్కిల్ కేసులో కూడా బాబు తరుపున కోర్టులో వాదనలు వినిపించారు. చంద్రబాబు తరుపున పని చేసిన ఏ వ్యక్తి అయినా తమ ప్రత్యర్థులకు అనుకూలంగా పని చేసినట్లయితే అది వృత్తి ధర్మమైనా క్షమించేది లేదు అన్నట్లుగా ప్రవర్తిస్తుంటారు వైసీపీ శ్రేణులు.

లూథ్రా తన వృత్తిలో భాగంగా తన సాయం కోరి వచ్చినా, తానూ మెచ్చిన మొత్తంలో పైకం చెల్లించిన వారి తరుపున తన విద్యను ఉపయోగిస్తుంటారు.ఇలా చేయడం ఆయన వృత్తి ధర్మం. దీనినికూడా తప్పుబట్టారు వైసీపీ నేతలు. చంద్రబాబుకి, సునీత రెడ్డికి ఒక్క వక్తే న్యాయవాదిగా పని చేయడంతో లూథ్రా చంద్రబాబు మనిషి అని, సునీతా రెడ్డి బాబు చెప్పినట్టు ఆడుతున్న ఆటబొమ్మ అని అటు లూథ్రాను ఇటు తమ సొంత చెల్లి అయినా సునీతా రెడ్డి పైన వైసీపీ సోషల్ మీడియాలో విష ప్రచారాలే నడిపించారు వైసీపీ పెద్దలు.

ADVERTISEMENT

అయితే కేవలం తన పార్టీకి రహస్య మిత్రుడైన ఆర్జీవీ తీసిన ఒక్క సినిమా రిలీజ్ కోసం ఏకంగా జగన్ అక్రమాస్తుల కేసులు వాదిస్తున్న నిరంజన్ రెడ్డి రంగంలోకి దిగడం చూస్తుంటే వైసీపీ శ్రేణులు చేసిన విమర్శలు ఒక్కసారిగా చర్చకొచ్చాయి. అంటే జగన్ ఆర్జీవీ సినిమా విడుదల కోసం ఏకంగా తన తరుపున వాదనలు వినిపిస్తున్న నిరంజన్ రెడ్డిని ప్రయోగిస్తున్నారా? ఆ సినిమా విడుదల కోసం జగన్ ఎందుకు ఇంతలా ఆరాటపడుతున్నారు.అయితే ఆర్జీవీ జగన్ చేతిలో ఆటబొమ్మా? నిరంజన్ రెడ్డి జగన్ వ్యక్తిగత సిబ్బందా?

మద్యం సీసాలతో, బూతు బొమ్మలతో, అసభ్యకర పోస్టులతో నిత్యం సోషల్ మీడియాలో రచ్చచేసే ఇటువంటి ఉన్మాదికి జగన్ అండగా నిలబడుతున్నారంటేనే అర్ధం చేసుకోవాలి వైసీపీ పార్టీ ఎటువంటి వ్యక్తులను చేరదీస్తుందో? ఎటువంటి వ్యక్తులకు అండగా నిలబడుతుందో?పరాన్న జీవిగా చెప్పుకునే ఈ ఆర్జీవీ ఇంతవరకు పన్నిన వ్యూహాలు ఎవరి అండతో చేసాడో ఇప్పటికైనా ఏపీ ప్రజలు అర్ధం చేసుకుని అలోచించి ముందడుగు వేయాలి.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

List Of Titles Arriving On OTT This Week!

The last few weeks have been rather dry for the Indian OTT audience with not…

14 minutes ago

Virat Kohli Deserved Better? Former India Brutal Verdict!

Virat Kohli’s Test retirement is back in the discussion, but this time, the focus is…

44 minutes ago