
వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నిన్న బంగారుపాళ్యం పర్యటనలో ఎంత హడావుడి చేశారో, ఎంత ఉద్రిక్తంగా సాగిందో అందరూ చూశారు. ఆయన మామిడి రైతుల సమస్యలని అడిగి తెలుసుకునేందుకు అక్కడికి వెళ్ళానని చెప్పుకున్నారు.
కనుక జగన్ పర్యటన తర్వాత ప్రజలు, ప్రభుత్వం, మీడియా అందరూ కూడా మామిడి రైతుల సమస్యల గురించి ఆలోచింపజేయగలిగితే, ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకునేలా చేయగలిగితే ఆయన పర్యటన విజయవంతమైనట్లు పరిగణించవచ్చు.
కానీ మామిడి రైతుల సమస్యల గురించి జగన్ మాట్లాడిన దాని కంటే ఆయన, వైసీపీ శ్రేణులు దారి పొడవునా చేసిన డ్రామాలే ఎక్కువగా హైలైట్ అయ్యాయి.
జగన్ పర్యటనని వైసీపీ శ్రేణులందరూ కలిసి బాగా రక్తి కట్టించారు. కనుక ప్రజలు కూడా జగన్ పర్యటన, దానిలో పాల్గొన్న వేలాదిమందిని, వారు చేసిన డ్రామాల గురించే మాట్లాడుకున్నారు. జగన్ కూడా అదే కోరుకున్నారు కదా? అంటే జగన్ తన రాజకీయాలకు మామిడి రైతుల సమస్యలను ఉపయోగించుకున్నారన్న మాట!
జగన్ ఎప్పుడు ఏ పని చేసినా దాని పట్ల నిబద్దత ఉండదు. సమైక్య రాష్ట్రం, ప్రత్యేక హోదా, మూడు రాజధానులు, విశాఖ రాజధాని, పోలవరం, ఇప్పుడు పరామర్శ యాత్రలు వంటి ఉదాహరణలు చాలానే ఉన్నాయి.
చివరికి ఆయన ఎంతో గొప్పగా చెప్పుకున్న సంక్షేమ పధకాలు కూడా ఓటు బ్యాంక్ పెంచుకోవడం కోసమేనని అందరికీ తెలుసు.
కనుక చేసే పని పట్ల జగన్‌కి నిబద్దత లేకపోగా దాని నుంచి రాజకీయ లబ్ధి కూడా ఆశిస్తుంటారు. అందువల్లే ప్రజలు ఆయనకు రెండో ఛాన్స్ ఇవ్వడానికి ఇష్టపడలేదు.
కానీ జగన్ తీరు మారకపోగా ఇంకా వినాశకరంగా మారుతోంది. నిన్న బంగారుపాళ్యంలో మామిడి రైతులు నష్టపోతున్నారని నిరూపించేందుకు ఇరుగు పొరుగు జిల్లా
Fauzi is now reportedly targeting a March 18, 2027 release. The film was originally scheduled…
The bodycam footage of an arrest has gone viral on Instagram. The footage shows police…