
చొక్కా మడత పెడతా….జగన్ 2.0 చూపిస్తా, రప్ప రప్ప రాజకీయం, మేము అధికారంలోకి వస్తే ఎక్కడున్నా వదిలిపెట్టం….ఇలా వైసీపీ క్యాడర్ ని ఉత్సాహపరచడానికి, ఆ పార్టీ లీడర్లను ఉత్తేజింపచేయడానికి వైఎస్ జగన్ తానూ ఒక పార్టీ అధ్యక్షుడిని అని మరిచి ఒక మాజీ ముఖ్యమంత్రిని అనే విషయాన్నీ విస్మరించి మరి రెచ్చకొట్టే ప్రకటనలు చేస్తారు.
మాకు అధికారం కావలి, మా పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చెయ్యాలి….ఎందుకంటే ఇప్పుడు మా పార్టీ క్యాడర్ ని అరెస్టు చేసిన వారి పై కక్ష తీర్చుకోవాలి, మా పార్టీ లీడర్ల మీద కేసులు పెడుతున్న వారి పై పగ సాధించాలి, మా రప్ప రప్ప రాజకీయాలను అణిచివేస్తున్న వారి పై ఆధిపత్యం సాగించాలి,
మా పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా రాష్ట్ర రాజధానిగా అభివృద్ధి చెందుతున్న అమరావతిని మావిగన్ పేరుతో మరోసారి విధ్వంశం చెయ్యాలి….అంటూ వైసీపీ అధినేత వైఎస్ జగన్ నుంచి ఆ పార్టీ నాయకులు, క్యాడర్ అందరు ఏకతాటి మీదకొచ్చి ముక్తకంఠంతో ప్రకటనలు చేస్తున్నారు.
రాష్ట్రాన్ని రాజకీయ కక్షలతో రచ్చలేపుతామని, రాష్ట్రంలో వ్యక్తిగత ద్వేషాలతో విధ్వంశం సృష్టిస్తామని, ప్రత్యర్థుల మీద రాజకీయ ఆధిపత్యం సాగించడానికి రాష్ట్ర భవిష్యత్ ని సైతం బలిపీఠం ఎక్కిస్తాం అనేలా వైసీపీ శ్రేణులు చేస్తున్న ప్రకటనలు అన్ని కూడా జగన్ తన పాదయాత్రతో మాఫీ చెయ్యగలరా.?
2019 నాటి వైసీపీ పాలనను చూసిన ఏపీ ప్రజలను, 2024 తరువాత వైసీపీ నేతలు చేస్తున్న రాజకీయ ప్రకటనలను వింటున్న ఓటర్లను జగన్ తన పాదయాత్రతో తిరిగి వైసీపీ వైపు ఆకర్షించగలరా.? ఒక్క స్థానిక ఎన్నికల గెలుపు కోసం చొక్కాలు మడత పెడతాం అంటూ పార్టీ క్యాడర్ ని రెచ్చకొడుతున్న జగన్ రాష్ట్రంలో అర్నాబ్ తుఫాన్ తో అల్లాడుతున్న జిల్లాల ప్రజల కోసం, వారికీ చేయూత నిచ్చేందుకు గాను తన పార్టీ క్యాడర్ ని ఎందుకు ముందుకు తీసుకురాలేకపోతున్నారు.?
రాష్ట్రంలో ఎప్పుడు ఏ ప్రకృతి విపత్తు వచ్చినా వైసీపీ పార్టీ నుంచి ఇటు రాష్ట్రానికి అటు బాధిత ప్రాంతాలకు అందే సాయం ఏంటి.? 2029 గెలుపు కోసం రప్ప రప్ప రాజకీయాలను ప్రోత్సహించడానికి వెనుకాడని జగన్ రాష్ట్రం కష్టకాలంలో ఉన్నపుడు ఎందుకు వెనకడుగు వేస్తున్నారు.?
అర్నాబ్ తుఫాన్ తో ఒక పక్క ఏపీలో పలుజిల్లాలు అల్లాడుతుంటే పులివెందుల స్థానిక ఎన్నికల గెలుపు కోసం చొక్కాలు మడత పెట్టాం అంటూ జగన్ చేస్తున్న రాజకీయ ప్రకటనలకు ఇది సమయమేనా.? ఇవన్నీ గమనిస్తున్న ప్రజలు రాబోయే రోజులలో కాబోయే ముఖ్యమంత్రి పదవి కోసం జగన్ మొదలుపెట్టబోతున్న పాదయాత్రకు మద్దతు తెలుపుతారా.?
Following its Los Angeles premiere, Ramayana: Part 1 has received mixed reactions from viewers. While…
Keerthy Suresh has spent years stepping into characters written by others. Now, she has been…