
కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేని వైసీపీ అధినేత వైస్ జగన్ మోహన్ రెడ్డి తిరిగి తన పార్టీని అధికారం దిశగా నడపడానికి యాత్రల పేరుతో ఎప్పటికప్పుడు బలప్రదర్శనకు సిద్దమవుతూ పార్టీ క్యాడర్ ని ఎలర్ట్ చేస్తున్నారు.
ఇందులో భాగంగా ఈ నెల 9 న మరకపాలెం లో నిర్మాణంలో ఉన్న మెడికల్ కాలేజీ సందర్శనకు గాను రోడ్ షో చేసేందుకు సిద్ధమయ్యారు జగన్. అయితే గత ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ కేవలం 5 కిమీ దూర ప్రయాణానికి సైతం హెలిప్యాడ్లు వాడారు. తన చుట్టూ పరదాలు నిర్మించుకుని మరి సభా వేదిక మీదకు ప్రత్యక్షమయ్యారు.
అటువంటి జగన్ ఇప్పుడు అధికారం కోల్పోయి ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోకపోవడంతో తిరిగి ప్రజలను తన వైపుకి తిప్పుకోవడానికి ప్రజా పోరాటాలు, పోరాట యాత్రలు అంటూ రోడ్డు బాట పడుతున్నారు. నాడు కనీసం 5 కిమీలకు కూడా హెలిప్యాడ్లు వినియోగించిన జగన్ నేడు సుమారు 60 కిమీ రోడ్ షో కి అనుమతి ఇవ్వాలంటూ అధికారులతో వాగ్వాదానికి వస్తున్నారు.
అయితే ఈ యాత్రలతో ప్రజల మద్దతు పొంది తిరిగి వైస్ జగన్ తన పరదాలను తానూ దక్కించుకునే ప్రయత్నం చేస్తున్నారా అంటూ వైసీపీ మీద సోషల్ మీడియాలో కౌంటర్ లు పేలుతున్నాయి. అయితే గతంలో వైసీపీ రోడ్ షో లు, ర్యాలీలకు ఉన్న ట్రాక్ రికార్డు దృష్ట్యా అధికారులు జగన్ షో ల రాజకీయానికి షరతులతో కూడిన అనుమతులు జారీ చేసారు.
అధికారం కోసం ఇలా ప్రజల చుట్టూ తిరిగి అధికారం వచ్చాక అదే ప్రజలను తన చుట్టూ తిప్పించుకునే వైసీపీ రాజకీయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎన్నో గుణపాఠాలను నేర్పించింది. అలాగే అక్కడి ప్రజలకు ఎంతో రాజకీయ జ్ఞానాన్ని తెచ్చిపెట్టింది. కాబట్టి యాత్రల పేరుతో జగన్ చేస్తున్న ఈ షో ల రాజకీయం ప్రజలను ఏ మేరకు మెప్పిస్తాయో కాలమే బదులు చెప్పాలి.
Ahmedabad’s Navratri celebrations are known for late nights, hours of energetic Garba and elaborate outfits,…
రాష్ట్ర విభజన తరువాత ఏపీలో జరిగిన 2014 ఎన్నికలకు టీడీపీ, బీజేపీ పొత్తులో ముందుకెళ్లాయి, వారిద్దరి రాజకీయ పొత్తుకు జనసేన…