
అవును.. కాస్త అటూ ఇటూగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఈరోజు జిల్లా అధ్యక్షులకు చెప్పింది ఇదే. తాడేపల్లి ప్యాలస్‌లో జరిగిన సమావేశంలో తన పాలన వెర్సస్ చంద్రబాబు పాలనపై పాచిపాట పాడిన తర్వాత, ఇక పార్టీని గెలిపించే బాధ్యత మీ భుజాలపైనే ఉందని జగన్ తేల్చి చెప్పేశారు.
జిల్లా అధ్యక్షులే ‘పార్టీ ఓనర్ షిప్’ తీసుకోవాలని జగన్ అన్నారు. అంటే వైసీపీ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీలో జిల్లా అధ్యక్షులని షేర్ హోల్డర్స్ స్థాయి నుంచి డైరెక్టర్స్ స్థాయికి జగన్ ప్రమోట్ చేసినట్లు భావించాల్సి ఉంటుంది.
గ్రామ స్థాయి వరకు పార్టీని బలోపేతం చేయడం మొదలు నేతల కీచులాటలు పరిష్కరించే వరకు అన్ని బాధ్యతలు మీవే అని జగన్ తేల్చి చెప్పేశారు. గ్రామ, మండల స్థాయిలో కమిటీల నియామకంలో మీకు పూర్తి స్వేచ్చ ఇస్తున్నానని జగన్ చెప్పారు.
అధికారంలో ఉన్నప్పడు కంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడే మన నాయకత్వ ప్రతిభ మరింత బాగా బయటపడుతుందని జగన్ హితవు పలికారు. కనుక వచ్చే ఎన్నికలలో ప్రతీ జిల్లాలో అన్ని సీట్లు వైసీపీ గెలుచుకునేలా చేయాలని, అదే మీ అందరి బాధ్యత అని జగన్ చెప్పేశారు.
వైసీపీలో అభ్యర్ధి, బలం ముఖ్యం కాదని ఎవరిని నిలబెట్టినా తన పేరు, ఫోటోతోనే గెలుస్తారని జగన్ గట్టిగా నమ్ముతుంటారు. 2025 ఎన్నికలలో ఆవిదంగానే రాష్ట్రమంతా తన ఫోటోలతో ‘యుద్ధం సిద్ధం’ అంటూ పోస్టర్స్ పెట్టించారు.
కానీ ఎన్నికలలో వైసీపీ ఓడిపోయింది. అంటే జగన్ ఓడిపోయినట్లే తప్ప అభ్యర్ధులు ఓడిపోయిన్నట్లు భావించలేము.
జగన్ విచిత్ర ధోరణి, మూడు రాజధానుల ప్రతిపాదన, పిచ్చి నిర్ణయాలు, కక్ష సాధింపులు, అప్పులు, అవినీతి, అక్రమాలు, వైఫ్యల్యాలు అన్నీ ఆయన ఖాతాలోనే జమా చేయాలి. కానీ ఈవీఎంల ఒడిపోయామని, చంద్రబాబు నాయుడు మాయ మాటలతో ప్రజలను నమ్మించడం వలన ఓడిపోయామని, జగన్ తన ఓటమిని ఇతరులకు బదిలీ చేశారు.
ఇప్పుడు వైసీపీని ‘ఓన్ చేసుకోమని’ చెపుతున్న జగన్, ఎన్నికల సమయంలో వారికీ, వారు సూచించిన వారికే తప్పకుండా టికెట్స్ ఇస్తారా? అంటే అనుమానమే.
జగన్ తాడేపల్లి ప్యాలస్‌లో కూర్చొని సేదతీరుతుంటే, జిల్లా అధ్యక్షులు, కార్యకర్తలు ఎండల్లో పడి తిరుగుతూ పార్టీని బలోపేతం చేసి పెట్టాలన్న మాట!
ప్రతిపక్షంలో ఉన్నప్పుడే మన నాయకత్వ లక్షణాలు బయటపడతాయన్న జగన్ మాట అక్షరాల సత్యం.. అని చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నిత్యం ప్రజల మద్యే ఉంటూ నిరూపించి చూపారు. జగన్ మాటలు ప్యాలస్ దాటుతున్నాయి కానీ ఆయన మాత్రం కోట దాటి అడుగు బయటపెట్టడం లేదు!
A little over two years after the previous Assembly elections, Andhra Pradesh is preparing for…
Rashmika Mandanna’s absence from the Ranabaali trailer launch became one of the talking points of…