Telugu

కొడాలి స్వామి భక్తికి ప్రతిఫలం..! అనుభవించక తప్పదుగా..!

తమను నమ్మి ఓటేసిన ప్రజలను రోడ్లకు వదిలేసి తమ వ్యక్తిగత ఏజెండాలతో, అధిష్టానం మెప్పు కోసం, రాజకీయ విలువలు అనేవాటికి చరమ గీతం పాడి, తనకు వచ్చిన మంత్రి పదవిని సైతం తమ ప్రత్యర్థి పార్టీ నేతలను బూతులు తిట్టడానికే అన్నట్లుగా వ్యవహరించిన గుడివాడ వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నానికి అధినాయకత్వం భారీ షాక్ ఇచ్చింది.

2019 ఎన్నికల తరువాత అధికారంలోకి వచ్చిన జగన్ సర్కార్ కొడాలి నానిని ఒక “బూతుల మంత్రిగా” మార్చేసింది. వైసీపీ ప్రభుత్వం ప్రభుత్వ స్కూల్ లో ప్రవేశ పెట్టిన ఇంగ్లీష్ మీడియం చదువులు సమాజాన్ని ఏమేరకు ప్రభావితం చేసిందో తెలియదు కానీ కొడాలి నాని ప్రవేశపెట్టిన బూతుల మీడియం మాత్రం ఎవత్ రాష్ట్రాన్ని మొత్తం ప్రభావితం చేసింది.

ADVERTISEMENT

ఒక ప్రతిపక్ష నేతను, ఆయన కుమారుడిని, ఆయన కుటుంబాన్ని మరి ఇంతదారుణంగా తిట్టొచ్చా అని వినేవాళ్ళు నోరువెళ్ళబెట్టేంతల బాబు ని ఉద్దేశించి కొడాలినాని వ్యాఖ్యలు ఉండేవి. దీనితో అటు టీడీపీ సానుభూతి పరులతో పాటుగా సామాన్య ప్రజానీకానికి కూడా కొడాలి పై ఏసడింపు, బాబు పట్ల సానుభూతి రెండు ఏకపక్షంలో జరిగిపోయాయి.

ఒక్కదెబ్బకు రెండు పిట్టలు అనే మాదిరిగా జగన్ వ్యవహార శైలి ఉంటుంది. చంద్రబాబు ని ఆయన కుటుంబాన్ని అందరి ముందు కించపరచాలి. అందుకు ఆ పార్టీ నుండి బయటకు వచ్చిన నాయకుడే కావలి, అందునా ఆ సామజిక వర్గం నేతే అయ్యిండాలి అనుకున్న జగన్ కు కొడాలి ఒక అస్త్రం లా దొరికారనే చెప్పాలి. అంటే తమ ప్రత్యర్థిని ఆయన సామజిక వర్గం నేతతోనే దూషించేలా చేయడంతో అటు బాబుని, ఇటు ఆ సామజిక వర్గాన్ని సమాజంలో కించపరచడం ద్వారా జగన్ అనుకున్న రెండు లక్ష్యాలు నెరవేరుతున్నాయి.

గడిచిన నాలుగున్నరేళ్ళగా కొడాలి నాని రాష్ట్రానికి చేసిన సేవ ఏమన్నా ఉందా అంటే అది బాబుని బూతులు తిట్టడం, జగన్ కు భజన చేసుకోవడమే అని చెప్పాలి. దీనితో నాని పై స్థానికంగా తీవ్ర వ్యతిరేకత చోటు చేసుకుంది. ఈసారి ఎన్నికలలో కేవలం గెలుపు గుర్రాలకు మాత్రమే సీట్లు అంటూ చెప్పుకొస్తున్న జగన్ అందుకు తగ్గట్టే మార్పులు చేర్పులు చేసుకుంటూ ఒడివడిగా అడుగులు వేసుకుంటూ ఏడూ జాబితాలను విడుదల చేసారు.

అయితే కొడాలి స్వామి భక్తిని మెచ్చిన జగన్ ఈసారి గుడివాడలో టీడీపీ చేతులో కొడాలికి జరగబోయే పరాభవాన్ని తప్పించి హనుమంత రావు కు అవకాశం కల్పించనున్నారనే వార్త ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. జిల్లా నూతన వైసీపీ అధ్యక్షుడైన హనుమంత రావు కి శుభాకాంక్షలు అంటూ గుడివాడ సెంటర్స్ లో ఫ్లెక్సీలు వెలిసాయి. దీనితో జగన్ కొడాలికి టికెట్ నిరాకరించారు అనే వార్త గుడివాడ కొడాలి వర్గీయులలో తీవ్ర అసంతృప్తి నెలకొంది.

అధికారం ఉంది అనే అహంకారంతో జగన్ అండ చూసుకుని కొడాలి నాని, నాని ఉన్నాడు అనే భరోసాతో ఆయన అనుచరులు స్థానికం గా చేసిన అరాచకాలు ఇన్నిఅన్ని కావు. ఈసారి రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగితే అందరి ద్రుష్టి గుడివాడ ఎమ్మెల్యే నాని అలియాస్ బూతుల మంత్రి పైనే. ఒకరిని అవమానించి, అన్యాయంగా ఒకరిని నిందించి తమ ప్రాబల్యాన్ని పెంచుకోవాలి అని చూసిన, చూస్తున్న రాజకీయ నాయకులకు కొడాలి నాని ఉదంతం ఒక గుణపాఠం కావాలి.

ఎవరి మెప్పు కోసమో నోరుపారేసుకుంటే చివరికి తమ రాజకీయ జీవితాన్ని పోగొట్టుకోవాల్సిందే అని కొడాలి వంటి నాయకులకు జగన్ చెప్పకనే చెప్పారు.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Imran Khan Faces Exit Notice After Mumbai Protest

Actor Imran Khan is facing fresh controversy after taking part in a protest in Mumbai.…

2 minutes ago

Ram Charan Trusts Sukumar to Build RC17 His Way

Ram Charan is reportedly giving Sukumar complete freedom to shape their next collaboration, tentatively titled…

31 minutes ago