Telugu

యలహంక ప్యాలస్ లోకి షర్మిలకు ‘నో’ ఎంట్రీ..?

రాజకీయ నాయకుల వ్యక్తిగత వివాదాలకు వైసీపీ దూరం అంటూ నాడు పార్టీ అధినేతగా వైఎస్ జగన్ ఇచ్చిన ‘నో’ ప్రకటనలో ‘నో’ అంటే ఇదేనా అంటూ వైసీపీ ప్రత్యర్థి పార్టీల నేతలు నోరెళ్లబెడుతున్నారు. గత కొన్ని రోజులుగా బెంగళూరు లోని యలహంక ప్యాలస్ కేంద్రంగా వైఎస్ కుటుంబంలోని అంతర్గత విభేదాలు రచ్చకెక్కుతున్నాయి. కాదుకాదు కోర్ట్కెక్కుతున్నాయి అనే చెప్పాలి.

షర్మిల కుమార్తె వివాహ వేదిక తో మొదలైన ఈ యలహంక రాజకీయం ఇప్పుడు షర్మిల కు ‘నో ఎంట్రీ’ వరకు వచ్చిందా? నాడు షర్మిల కుమార్తె అంజలి రెడ్డి వివాహ వేదికగా యలహంక ప్యాలస్ కు ‘నో’ చెప్పిన జగన్ తాజాగా అసలు ప్యాలస్ లోపలికి షర్మిల కు నో చెప్పడానికి సిద్ధమయ్యారా?

ADVERTISEMENT

అందులో భాగంగానే జగన్ కోర్టు మెట్లెక్కారా? బెంగళూర్ లోని యలహంక ప్యాలస్ లోపలికి షర్మిల ప్రవేశించకుండా అడ్డుకునేందుకు వైసీపీ అధినేత వైఎస్ జగన్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ మేరకు దేవనహళ్లి కోర్టు లో సిలికాన్ బిల్డర్స్ లిమిటెడ్ పేరుతో పిటిషన్ వేశారు.

అయితే కుమార్తె వివాహ కార్యక్రమాల కోసం షర్మిల తన కుటుంబంతో కలిసి ఆదివారం యలహంక ప్యాలస్ కి వెళ్ళబోతున్న ఈ తరుణంలో ఇప్పుడు జగన్ ఇలా షర్మిలకు నో ఎంట్రీ బోర్డు పెట్టడానికి కోర్టు ను ఆశ్రయించడంతో అసలు జగన్ ఉద్దేశం ఏమిటి? ఈ యలహంక ప్యాలస్ పై షర్మిలకు ఎటువంటి హక్కు, అధికారం లేదని చెప్పదలచారా?

ఈ ప్యాలస్ జగన్ సతీమణి భారతి రెడ్డి తల్లి సుగుణమ్మ పేరు మీద ఉందని, ఇది తన అత్తగారి ఆస్తి అని, ఇందులో షర్మిలకు ఎటువంటి వాటా లేదని జగన్ చెప్పాలనుకుంటున్నారా? అందులో భాగంగానే భద్రతా కారణాలు చెప్పి ఇప్పటికే నిశ్చయించిన వివాహ వేదిక (యలహంక ప్యాలస్) మార్పుకి షర్మిల పై ఒత్తిడి తెచ్చారు.

ఇక ఇప్పుడు అసలు షర్మిల ఆ ప్రాంగణంలోకి అడుగుపెట్టేందుకు కూడా నిరాకరిస్తూ ఆమెకు యలహంక లోకి నో ఎంట్రీ ఇవ్వాలంటూ కోర్టు ను ఆశ్రయించారు. ఒకపక్క జగన్ తల్లి విజయలక్ష్మి షర్మిలకు మద్దతుగా యలహంక షర్మిల వాటా లో భాగం అంటూ జగన్ కు వ్యతిరేకంగా ప్రకటనలు చేస్తున్నా జగన్ మాత్రం తన వాదనకు కట్టుబడి కోర్టు కెక్కడం జగన్ ను నైతికంగా, వైసీపీని రాజకీయంగా మరింత పతనం చేయనుందా? అన్న చర్చ నడుస్తుంది.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Jagan Approaches Court to Stop Sharmila from Entering Yelahanka House

The family dispute between YS Jagan Mohan Reddy and his sister YS Sharmila has taken…

8 minutes ago

Aakasamlo Oka Tara BO: Audiences Must Wake Up Now!

Among this week's three releases, Dulquer Salmaan and Satvika Veeravalli's Aakasamlo Oka Tara has received…

38 minutes ago