
Jagan's Election Strategy and YSRCP's Local Poll Performance
సాధారణంగా స్థానిక సంస్థల ఎన్నికలలో అధికార పార్టీ మెజార్టీ సీట్లు గెలుచుకుంటాయని అందరికీ తెలుసు. ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఈ విషయం ఇంకా బాగా తెలుసు.
అందుకే ఈ ఎన్నికలలో మనం గెలవడం కష్టమని ముందే చెప్పేశారు. అయినా కూడా కూటమికి గట్టి పోటీ ఇద్దామని జగన్ చెప్పడం సహేతుకమే. ఎందుకంటే, ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలు గెలుపోటములతో సంబంధం లేకుండా ఎన్నికల్లో పోటీ చేయాలనుకోవడం చాలా మంచి విషయమే.
అయితే ఈ ఎన్నికలలో ఏకగ్రీవాలు జరిగితే ఆయా నియోజకవర్గాల ఇన్చార్జిలకు శాసనసభ ఎన్నికలలో టికెట్స్ ఇవ్వబోమని జగన్ బెదిరించడం చాలా పొరపాటు. ఇది పార్టీలో ఆయన పట్ల వ్యతిరేకత పెంచడమే కాకుండా, వారిని ఎంతకైనా తెగించేలా ప్రోత్సహించినట్లు కూడా అయ్యింది. అందువల్లే ఈ ఎన్నికల్లో ఈ స్థాయిలో ఘర్షణలు విధ్వంసం జరిగింది.
దీనికి జగన్ లేదా వైసిపిదే పూర్తి బాధ్యత అని నిందించలేము. కానీ ఈ ఎన్నికలలో ఏకగ్రీవాలు జరగకూడదని జగన్ తన పార్టీ నేతలకు గట్టిగా వార్నింగ్ ఇవ్వడం కూడా ఒక కారణమని చెప్పక తప్పదు.
అయితే ఈ విధంగా చెప్పిన తర్వాత కూడా జగన్ ప్రాతినిధ్య వహిస్తున్న పులివెందులతో సహా రాష్ట్రంలో వైసీపీ నేతలు చాలా బలంగా ఉన్నచోట కూడా కూటమి పార్టీలు ఏకగ్రీవాలు సాధించగలిగాయి. కనుక ఈ విధంగా మాట్లాడి జగన్ చేజేతలా ఈ అవమానకర పరిస్థితులు కల్పించుకున్నారని చెప్పక తప్పదు.
ఈ ఎన్నికలలో వైసిపి గెలవాలని జగన్ కోరుకుంటే తప్పులేదు. కానీ ప్రజాస్వామ్యాన్ని ప్రతిబింబించాల్సిన ఈ ఎన్నికలను కూడా జగన్మోహన్ రెడ్డి ఒక రాజకీయ చదరంగంగానే భావించి ఆడారు.
అయితే ఈ ఆటలో ఆయన సీఎం చంద్రబాబు నాయుడుని, కూటమి ప్రభుత్వాన్ని, ముఖ్యంగా… టిడిపిని కాస్త ఇబ్బంది పెట్టగలిగారు. బురద జలగలిగారు.
కానీ సరిగ్గా ఇదే కారణంగా కూటమి పార్టీలు వైసీపీని ఓడించాలనే పట్టుదలతో మరింత గట్టిగా పోరాడేలాగా చేశారు. అందువల్లే ఈ ఎన్నికలలో వైసిపి గౌరవప్రదమైన స్థానాలు కూడా దక్కించుకోలేక చతికిలబడింది.
ఒకవేళ జగన్ ఈవిధంగా చేయకపోయినా కూడా వైసిపి తప్పకుండా ఇన్ని స్థానాలు గెలుచుకుని ఉండేది. అటువంటప్పుడు ఇంత రాద్ధాంతం చేయడం దేనికి? అందర్నీ ఇబ్బంది పెట్టడం దేనికి? చివరికి విమర్శల పాలవడం, అవమానపడటం అవసరమా?
బహుశా జగన్మోహన్ రెడ్డి తన సత్తా నిరూపించుకోవడానికి వైసిపిని పణంగా పెట్టి ఈ రాజకీయ చదరంగం ఆడినట్లు అనిపిస్తోంది.
Vishwaksen is presenting a thriller with CULT. The film’s release trailer has been unveiled a…
The Andhra Pradesh municipal elections have become a crucial test for the ruling alliance and…