
Jagan Faces Criticism After YSRCP Election Defeat
మున్సిపల్ ఎన్నికల్లో కూటమి విజయం సాధిస్తుందని వైసీపీకి కూడా తెలుసు. కానీ ఆ విజయాన్ని ఘన విజయంగా మార్చిన క్రెడిట్ చంద్రబాబు, పవన్, లోకేష్‌లకు కాదు… వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికే ఖచ్చితంగా దక్కుతుంది.
ఈ ఎన్నికల బాధ్యత పార్టీలో సీనియర్స్‌కు అప్పగించి జగన్ పైపైన చూసుకుని ఉంటే, వైసీపీ ఓడిపోయినా ఇంత అవమానకర పరిస్థితి ఎదుర్కోవాల్సి వచ్చేది కాదు.
కానీ నామినేషన్స్ మొదలు పోలింగ్ వరకు అన్నీ తానే ముందుండి నడిపించడం వల్లనే ఈ ఓటమికి జగన్ పూర్తి బాధ్యత వహించాల్సి వస్తోంది.
కానీ వహించకుండా ఎప్పటిలాగే సీఎం చంద్రబాబు నాయుడుని నిందిస్తూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఒక పార్టీని నడిపించే నాయకుడికి ఉండాల్సిన లక్షణం ఇదేనా?ఆలోచిస్తే మంచిది.
ఈ ఎన్నికలలో వైసీపీ ఓడిపోతుందని ముందే తెలిసి ఉన్నప్పటికీ నామినేషన్స్ మొదలు పోలింగ్, కౌటింగ్ వరకు జగన్ అమలు చేసిన వ్యూహాలన్నీ బెడిసి కొట్టాయి.
జగన్ పదేపదే మీడియా ముందుకు వచ్చి సిఎం చంద్రబాబు నాయుడు, కూటమి ప్రభుత్వం, ఎన్నికల సంఘంపై పదేపదే విమర్శలు చేశారు.
ఎన్నికల్లో రేయింబవళ్ళు పనిచేసే పోలీసులు, అధికారుల ఆత్మస్థైర్యం దెబ్బ తీసే విధంగా బెదిరింపులకు పాల్పడ్డారు.
ఎన్నికలను, చివరికి, పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియను అడ్డుకునేందుకు కోర్టులకు వెళ్ళారు. ఇవన్నీ ఆయనలో ఆందోళనకు అద్దం పట్టేవే.
కానీ ‘జగన్ 2.0’ అంటూ అసందర్భంగా ప్రగల్భాలు పలికారు. ఇటువంటివన్నీ కలిపి ఈ ఎన్నికల్లో వైసీపీ మామూలు ఓటమిని, దారుణ పరాజయంగా మార్చేశాయని భావించవచ్చు.
కనుక కూటమి ఘన విజయానికి, వైసీపీ దారుణ పరాజయానికి కూడా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కారణమని చెప్పక తప్పదు.
The arrival of Ramayana in theatres on November 5 is being promoted as one of…
The problem with Congress is not just the Gandhi family's control over the party. It…