
విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని తన సోదరుడు, టీడీపీ ఎంపీ కేశినేని శివనాధ్ (చిన్ని), అబ్బూరి సతీష్ అనే స్నేహితుడితో కలిసి ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీతో పేరుతో ప్రభుత్వం వద్ద కారు చౌకగా విశాఖలో 56.36 ఎకరాలు కొట్టేశారంటూ సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.
మంత్రి నారా లోకేష్ వెంటనే ఆయనకి ఘాటుగా బదులిచ్చారు. ఈరోజు ఎంపీ కేశినేని శివనాధ్ కూడా సోదరుది పేరు ఎత్తకుండానే చాలా ఘాటుగా బదులిచ్చారు.
వైసీపీ అధినేత జగన్ ఎప్పుడూ ఏదో ఓ కుట్రలు చేస్తూనే ఉంటారని, ఎవరో ఒకరిపై బురద జల్లుతూనే ఉంటారని కేశినేని శివనాధ్ అన్నారు. దీని కోసం రోజా వంటి కొందరు వైసీపీ నేతలతో జగన్ ఓ ఉల్ఫా బ్యాచ్ ఏర్పాటు చేసుకున్నారని, వారు ఒకరి తర్వాత ఒకరు లేదా మూకుమ్మడిగా జగన్ సూచించిన వారిపై బురద జల్లుతుంటారని ఎంపీ శివనాధ్ ఆరోపించారు.
ఐదేళ్ళలో జగన్ రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ, పెట్టుబడి తేలేకపోయినా, ఇప్పుడు తమ ప్రభుత్వం తెస్తుంటే వాటిని కూడా సైంధవుడిలా అడ్డుపడుతున్నారని అన్నారు. జగన్ ఉల్ఫా బ్యాచ్‌లో ఉన్నవారికి దమ్ముంటే ధైర్యంగా తనని ఎదుర్కోవాలని ఎంపీ శివనాధ్ సవాలు విసిరారు.
తనపై ఎంత బురద జల్లినా భరించగలను కానీ ఈవిదంగా దుష్ప్రచారం, కుట్రలు, కుతంత్రాలు చేస్తూ రాష్ట్రానికి పరిశ్రమలు, పెట్టుబడులు రాకుండా చేయాలనుకోవడం చాలా దుర్మార్గమని ఎంపీ శివనాధ్ అన్నారు.
కేశినేని సోదరుల మద్య విభేధాలను పక్కన పెడితే నాని వెనుక కూడా జగన్ ఉన్నారని, ఆయనే ఇటువంటి ఆరోపణలు చేయిస్తున్నారనే విషయం ఎంపీ శివనాధ్ బయటపెట్టారు. వైసీపీ హయాంలో జరిగిన ప్రతీ అవినీతి, అక్రమాలు వెనుక జగన్ ఉన్నారనే విషయం మెల్లమెల్లగా బయటపడుతోంది. జగన్ అధికారం కోల్పోయినా నేటికీ కుట్రలు, కుతంత్రాలు ఆపలేదని ఎంపీ శివనాధ్ స్పష్టం చేస్తున్నారు.
ఎల్లప్పుడూ జగన్ ఇతరులను అవహేళన చేయడమే తప్ప తనని అవహేళన చేస్తే భరించలేరు. ఇప్పుడు ఎంపీ శివనాధ్ మాటలు వింటే జగన్ హర్ట్ అవకుండా ఉంటారా?
Vijay’s son Jason Sanjay chose to make his entry into films as a director rather…
A little over two years after the previous Assembly elections, Andhra Pradesh is preparing for…