
ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టులకు టాలీవుడ్ లో మంచి డిమాండ్ ఉందని, ఒకప్పుడు ప్రకాష్ రాజ్ అనేకమైన విభిన్నపాత్రలు చేసి మెప్పించారని, ‘అంత:పురం’ సినిమాను ఇప్పుడు చూసినా…. ‘అమ్మ నా కొడుకు… ఏం చేశాడ్రా…’ అనే విధంగా ప్రకాష్ రాజ్ నటించాడని, అయితే ఇటీవల కాలంలో తానూ, సంపత్, సత్యరాజ్ వంటి నటుల మధ్య పోటీ ఏర్పడుతోందని, ఇలాంటి స్ఫూర్తిదాయకమైన పోటీ ఇండస్ట్రీలో ఎప్పుడూ ఉండాలని, ఈ పోటీని తానూ ఎప్పుడూ ఆశ్వాదిస్తానని అన్నారు.
ప్రస్తుతానికి తనకు కాలం కలిసి వస్తోంది అన్న జగపతి… భవిష్యత్తులో తన కుటుంబానికి ఒక ఇల్లు ఏర్పరచాలన్నది లక్ష్యంగా చెప్పుకొచ్చారు. తానూ కోట్లల్లో డిమాండ్ చేస్తున్న దానిపై కూడా వివరణ ఇచ్చిన ఈ మ్యాన్లీ స్టార్… సినిమాను బట్టే పారితోషికం ఉంటుది తప్ప, అన్ని సినిమాలకు ఒకే విధమైన తీరు ఉండదని, ఇటీవల ఓ చిన్న నిర్మాత తనను కలిసిన సందర్భంలో… ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా 25 రోజులు కాల్షీట్స్ ఇస్తానని చెప్పానని, పాత్ర నచ్చితే దేనికైనా సిద్ధం అన్న విధంగా తన ఆలోచనలు ఉంటాయని… తనపై వస్తున్న రూమర్లను ఖండించారు జగపతి.
Andhra Pradesh Congress president YS Sharmila has announced the engagement of her daughter YS Anjili…
For Nandamuri fans, Mokshagna Teja’s debut has gone from one of Tollywood’s most-awaited launches to…