Telugu

సెన్సార్ కాదు… హీరోయినే కట్ చేయమంటోంది..!

బాలీవుడ్ హీరోయిన్ల ‘లవ్ ఎఫైర్’లకు అంతు ఉండదన్న సంగతి బహిరంగ విషయమే. కాస్ట్యూమ్స్ చేంజ్ చేసినంత తేలికగా, ఏదో కారణం చెప్పి బాయ్ ఫ్రెండ్ లను మార్చే బాలీవుడ్ ముద్దుగుమ్మల జాబితాలో కత్రీనా కైఫ్ పేరేమీ కొత్త కాదు. ‘కండల వీరుడు’ సల్మాన్ ఖాన్ తో మొదలైన కత్రీనా ప్రస్థానం, లేటెస్ట్ గా రణబీర్ కపూర్ తో ముగిసింది. దీంతో మళ్ళీ సల్మాన్ చెంతకే చేరుతోందని బాలీవుడ్ మీడియా వర్గాలు కోడై కూస్తున్నాయి. అయితే కత్రీనాకు ఇక్కడే ఓ చిన్న చిక్కు వచ్చి పడింది.

ADVERTISEMENT

రణ్ బీర్ కపూర్ తో నటించిన ‘జగ్గా జాసూస్’ సినిమాలో కత్రీనా – రణ్ బీర్ ల మధ్య ఘాటు ఘాటు అధర చుంభనాల దృశ్యాలు ఉన్నాయట. అప్పట్లో వారిద్దరి ఎఫైర్ తో ఈ సన్నివేశాలు తెరపై అద్భుతంగా వచ్చాయని టాక్. కానీ, రణ్ బీర్ తో బ్రేకప్ తర్వాత, ‘జగ్గా జాసూస్’లోని ముద్దు సన్నివేశాలను తొలగించాలని దర్శకుడు అనురాగ్ బసును కత్రీనా డిమాండ్ చేస్తోందని బాలీవుడ్ వర్గాల బోగట్టా. అయితే ఇప్పటికే పలుమార్లు విడుదల వాయిదా పడిన ఈ సినిమా, ప్రస్తుతం విడుదలకు ముస్తాబవుతున్న నేపధ్యంలో దర్శకనిర్మాతలు కత్రీనా అభ్యర్ధనను నిరాకరిస్తున్నారట.

ఇప్పటికే చాలా సార్లు వాయిదా వేసాం గనుక, ఇంకా ఆలస్యం చేస్తే ఈ సినిమా ఆదరణ పొందదని, ఒకవేళ కత్రీనా కోరినట్టు ముద్దు సీన్లు తొలగించాలంటే కధను మార్చాల్సి ఉంటుందని, మళ్లీ పలు సన్నివేశాలను చిత్రీకరించాల్సిన అవసరం ఉంటుందని అనురాగ్ బసు భావిస్తుండడంతో, కత్రిన కోరికను మన్నించే అవకాశం లేదని తెలుస్తోంది. కధలో భాగంగా ప్రేయసితో కలిసి హీరో తన తండ్రిని వెతికే క్రమంలో ఘాటైన ముద్దు సీన్లు ఉన్నాయని తెలుస్తోంది. బహుశా వాటిని చూసి సల్మాన్ నొచ్చుకుంటాడని కత్రీనా భావిస్తుందేమో మరి!

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

కొండా సురేఖ: కొండ నాలుకకు మందేస్తే…

మంత్రి కొండా సురేఖ భయపడినట్లే జరిగింది. కాంగ్రెస్‌ అధిష్టానం నుంచి ఈరోజు ఉదయం ఆమెకు ఫోన్ వచ్చింది. ఈరోజు సాయంత్రం…

4 minutes ago

Revanth @ Hyderabad: Konda Surekha In Focus!

The chief minister of Telangana Revanth Reddy had been touring Delhi for the last few…

8 minutes ago