
“ఆ రావణుడ్ని సంపాలంటే సముద్రం దాటాలా… ఈ రావణుడ్ని సంపాలంటే సముద్రమంత దదద… ధై..ర్యం ఉండాలా… ఉందా…” అంటూ గంభీరమైన స్వరంతో జూనియర్ ఎన్టీఆర్ ప్రదర్శించిన వికటట్టాహాసం ప్రస్తుత తరం హీరోలలో మరొకరికి సాధ్యం కాదు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక దేవిశ్రీప్రసాద్ అందించిన ‘అసుర అసుర… రావణా రావణా…’ అనే బ్యాక్ గ్రౌండ్ సంగీతం మరియు బాబీ టేకింగ్, ప్రొడక్షన్ వాల్యూస్ అన్నీ ఈ టీజర్ కు అదనపు హంగులు.
ఈ టీజర్ తర్వాత ట్రేడ్ వర్గాలలో “జై లవకుశ” హాట్ ఫేవరేట్ గా మారుతుందని చెప్పడంలో సందేహం లేదు. విలనిజంలో కూడా హీరోయిజాన్ని ప్రదర్శించిన శాంపిల్ ఈ రేంజ్ లో ఉంటే, రేపు సిల్వర్ స్క్రీన్ పైన ఫుల్ లెంగ్త్ రోల్ చూసి తట్టుకోవడం ‘యంగ్ టైగర్’ ఫ్యాన్స్ వల్ల అయ్యే పనేనా?! అదేమో ఇప్పుడే చెప్పలేం గానీ, ఈ శాంపిల్ తో ఒక్కసారిగా మళ్ళీ హాట్ టాపిక్ గా మారిపోయాడు జూనియర్ ఎన్టీఆర్. నటన విషయంలో తారక్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
ప్రస్తుతం తారక్ వాకిట్లో క్యూ కడుతున్న అవార్డులే చెప్తాయి… నటుడిగా తారక్ ఎంతటి సమర్థుడో..! నటుడిగా ఎంతటి ప్రతిభావంతుడో, డైలాగ్స్ ను పలకడంలోనూ, అవే డైలాగ్స్ డిక్షన్ మార్చడంలోనూ… తనను కొట్టేవారు లేరు అన్న రీతిలో ఈ టీజర్ లోని డైలాగ్ ను తారక్ చెప్పాడు. ఇప్పటికే బ్యాక్ గ్రౌండ్ లో ‘టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్’ రూపంలో మూడు విజయాలు… తాజా సినిమాలో మూడు విభిన్నమైన పాత్రలు… ఇంతకుమించి బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించాలంటే ఇంకేం కావాలి..?
The Irumudi team had plenty to celebrate as the film’s extraordinary theatrical run continues, with the movie…
ఈ మధ్య రాజకీయాలలో అధికారంలో ఉంటే తప్ప అసెంబ్లీ కి వెళ్ళేది లేదు అనే ఒక వింత సంస్కృతీ మొదలయ్యిందనే…