
వచ్చే సంక్రాంతికి విడుదల కాబోతున్న “జై సింహా” కూడా ఇదే రొటీన్ కొట్టుడన్న విషయం టీజర్ స్పష్టం చేసింది. సమయం… సందర్భం… సినిమాలో ఉందో లేదో తెలియదు గానీ, వినడానికి, చూడడానికి “జై సింహా”లో వాడిన డైలాగ్ కర్ణకఠోరంగా ఉందని చెప్పవచ్చు. “సింహం మౌనాన్ని సన్యాసం అనుకోవద్దు, సైలెంట్ గా ఉందని గెలికితే తల కొరికేస్తది” అని చెప్పే బాలయ్య డైలాగ్ గానీ, రూపురేఖలు గానీ ఏ మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకునేలా లేవు.
టీజర్ చివర్లో కత్తి విసిరేసిన బాలయ్య గెటప్ ఒక్కటే కాస్త చూడదగినదిగా ఉంది తప్ప, ఈ టీజర్ గురించి చెప్పుకోవడానికి ఏమీ లేదు. బహుశా ట్రైలర్ విడుదలైతే “జై సింహా”పై ఫుల్ క్లారిటీ వస్తుందేమో గానీ, ప్రస్తుతం అయితే టీజర్ ను చూసి పెదవి విరిచే పరిస్థితే నెలకొంది. ఈ రొటీన్ “సింహా” బాక్స్ నుండి బయటకు రాకపోతే ఇక బాలయ్య సినిమాలను వీక్షించడం మరింత భారమవుతుందనే కామెంట్స్ సోషల్ మీడియాలో సర్వ సాధారణంగా వచ్చేవే.
Hunkkaar arrives with a subject that is bound to generate discussion, and its teaser suggests…
ఒక దేశాధినేత మొండి వైఖరి వలన అమెరికా-ఇరాన్, రష్యా-ఉక్రెయిన్ యుద్ధాలు జరుగవచ్చు. ఒక రాష్ట్రాధినేత మొండి వైఖరి వలన రాష్ట్రానికి…