Telugu

జగన్ ను కలవడమంటే సాధారణ విషయం కాదు!

వైసీపీ నుండి బయటకు వచ్చిన ఒక్కొక్కో ఎమ్మెల్యే జగన్ గురించి ఒక్కో కొత్త విషయం చెప్పుకొస్తున్నారు. పార్టీ సభ్యుల మాట అసలు వినరని, తనకు నచ్చిందే శిరోధార్యంగా పార్టీ సభ్యులు వ్యవహరించాలనే విధంగా జగన్ ఉంటారని పలువురు జగన్ పై చేసిన ఆరోపణలు తెలిసిందే. అయితే వీటికి తోడు తాజాగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గపు ఎమ్మెల్యే జలీల్ ఖాన్ మరికొన్ని కీలక వ్యాఖ్యలు చేసారు.

ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు అప్పాయింట్మెంట్ దొరుకుతుందేమో గానీ, జగన్ ను కలవాలంటే సాధారణ విషయం కాదని అభిప్రాయ పడ్డారు. పార్టీలో ఉన్న సమయంలో చాలాసార్లు తానూ జగన్ ను కలిసేందుకు ప్రయత్నించానని, కానీ అది కుదరలేదని, జగన్ ను కలవడం ఒక అసాధ్య ప్రక్రియ అని జలీల్ ఖాన్ బహిర్గతం చేసారు. అయితే, ముఖ్యమంత్రి అప్పాయింట్మెంట్ దొరకడం లేదని వైసీపీ అసత్య ప్రచారం చేస్తోందని, తానూ ఇప్పటివరకు చంద్రబాబును అప్పాయింట్మెంట్ లేకుండానే కలిసానని చెప్పుకొచ్చారు.

ADVERTISEMENT

రానున్న ఎన్నికల్లో ఆ పార్టీ తరపున గెలిచిన ఎమ్మెల్యేలెవరికీ జగన్ టికెట్లు ఇవ్వరని, కనీసం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి కూడా టికెట్ ఇవ్వరని, జగన్ ఏదనుకుంటే అదే చేస్తారని, ఎవరి మాటా వినరని జలీల్ ఖాన్ చేసిన విమర్శలకు జగన్ మీడియా… ‘జలీల్’కు పిచ్చి పట్టినట్లు ఉంది అంటూ వ్యక్తిగత విమర్శలకు దిగడం ఆ పార్టీ మరియు సదరు మీడియా నైతికతను చాటి చెప్తోందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

ఏపీ కాంగ్రెస్‌.. రాజకీయ ఉద్యోగ కల్పనకు మాత్రమేనా?

ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలుగా వైఎస్ షర్మిల బాధ్యతలు చేప్పట్టి రాష్ట్రానికి తిరిగి వచ్చినప్పుడు ఏదో జరుగబోతోందని అందరూ ఎదురుచూశారు.…

48 minutes ago

Antha Ramuloru Choosukuntaru Glimpse Draws Attention

Sangeeth Shoban and Anaswara Rajan’s upcoming youthful entertainer has finally revealed its title as Antha…

2 hours ago