Telugu

కలలో కధలు… సిల్వర్ స్క్రీన్ పై అద్భుతాలు..!

‘టెర్మినేటర్’ సినిమా ఆర్నాల్ట్ ష్క్వార్జ్ నెగ్గర్ కు హాలీవుడ్ లో సూపర్ స్టార్ హోదాను తెచ్చింది. ‘అవతార్’ శామ్ వర్తింగ్టన్ కు స్టార్ హోదా ఇచ్చింది. ఈ రెండు సినిమాల్లో హీరో పాత్రలు భూమికి సంబంధించని, అతీంద్రియ శక్తులు కలిగిన పాత్రలన్న సంగతి తెలిసిందే. ఈ రెండు సినిమాలు అప్పటివరకు ఉన్న రికార్డులన్నింటినీ బద్దలు కొట్టి సరికొత్త చరిత్రను సృష్టించాయి. అయితే ఈ పాత్రల రూపకల్పన వెనుక నిజమైన ‘కలలు’ ఉన్నాయని ఆ సినిమాల రూపకర్త జేమ్స్ కేమరాన్ తెలిపారు.

ఓ రోజు రాత్రి ఎర్రని మంటల్లో అస్థిపంజరం కాలుతున్నట్టు కల వచ్చిందని, ఆ కల తన బుర్రను వదల్లేదని, దాని స్పూర్తిగా కధను డెవలెప్ చేసి ‘టెర్మినేటర్’ సినిమా రూపొందించానని అన్నారు. ‘అవతార్’ కథకు కూడా అలాంటి నేపథ్యమే ఉందని, ఈ కథకు మాత్రం తన కాలేజీ రోజుల్లోనే బీజం పడిందని తెలిపారు. తన కలల్లో దట్టమైన అడవులు వస్తుండేవని, వాటినే తాను ‘అవతార్’ లో చూపించానని చెప్పిన జేమ్స్ కెమరూన్, ఈ సినిమాకు నాలుగు సీక్వెల్స్ రూపొందించే పనిలో పడ్డ విషయం తెలిసిందే.

ADVERTISEMENT
Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Not Here to Make Everyone Happy: GG’s Blunt Response

India head coach Gautam Gambhir has responded to the questions over Vaibhav Sooryavanshi's place in…

24 minutes ago

BB Telugu: Rohith’s Eviction Turns Controversial, Shocking & Irony

As we have already informed our readers, for the first time in Bigg Boss Telugu…

9 hours ago