
జమ్ము కశ్మీర్ ఉగ్రదాడిపై ప్రజల స్పందన ఊహించిన్నట్లే ఉంది. దేశ ప్రజలు చనిపోయినవారికి నివాళులు అర్పిస్తున్నారు. వారి కుటుంబాలకు సంఘీభావం తెలుపుతున్నారు. ఈ ఉగ్రదాడికి పాకిస్థాన్‌పై ప్రతీకారం తీర్చుకోవాలని కోరుతున్నారు.
దేశంలో మజ్లీస్ వంటి మతతత్వ పార్టీతో సహా అన్ని రాజకీయ పార్టీలు ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాయి. కానీ అంత వరకే ఏకాభిప్రాయం కనిపిస్తుంది. ఆ తర్వాత ఈ పరిణామాల నుంచి తమ పార్టీలకు ఏవిదంగా రాజకీయ మైలేజ్ లభిస్తుందా?అని ప్రతీ ఒక్కపార్టీ ఆలోచిస్తోంది.
కేంద్రం దీనికి మరింత హైప్ క్రియేట్ చేసి దేశ ప్రజలను బీజేపివైపు ఆకర్షించే ప్రయత్నం చేస్తోందని కాంగ్రెస్ వాదిస్తోంది. ప్రధాని మోడీ బిహార్ పర్యటనలో పాకిస్థాన్‌కి చేసిన హెచ్చరికలే ఇందుకు నిదర్శనమని కాంగ్రెస్ పార్టీ వాదిస్తోంది.
గతంలో ‘సర్జికల్ స్ట్రైక్’ పేరుతో హడావుడి చేసి ఎన్నికలలో దేశ ప్రజలను ఆకట్టుకోగా, ఇప్పుడు పాకిస్థాన్‌పై ఆంక్షలు, కఠిన నిర్ణయాలు, పాక్ పౌరుల బహిష్కరణ, వీసాలు నిలిపివేయడం, వాఘా సరిహద్దు మూసివేయడం వంటి వాటితో ప్రజలను ఆకర్షించాలని ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ పార్టీ వాదిస్తోంది.
మోడీ ప్రభుత్వం తన వైఫ్యల్యాలను, తప్పులను కప్పి పుచ్చుకునేందుకే ఇంత హడావుడి చేస్తోందని, కానీ వీటి వలన దేశాని వాణిజ్య పరంగా, దౌత్య పరంగా, ఆర్ధికంగా నష్టమే తప్ప ఎటువంటి లాభమూ ఉండదని కాంగ్రెస్ పార్టీ అభిప్రాయపడుతోంది. కాంగ్రెస్ మిత్రపక్షాలు కూడా ఇంచుమించు ఇటువంటి అభిప్రాయలే వ్యక్తం చేస్తున్నాయి.
మరోవిదంగా చెప్పాలంటే బీజేపి తమ ఓటు బ్యాంకుని ఎక్కడ హైజాక్ చేసి ఎత్తుకుపోతుందో అని కాంగ్రెస్ మిత్రపక్షాలు భయపడుతున్నాయని అనుకోవచ్చు. వాటి ఆరోపణలలో ఎంతో కొంత నిజం ఉంది కనుక పూర్తిగా కొట్టి పారేయలేము.
కానీ దేశ భద్రతకు సంబంధించిన ఈ అంశంపై రాజకీయాలు చేసుకుంటే మనమే నష్టపోతాము. భారత్‌పై పాక్ దాడి చేస్తుందని లేదా పాక్‌పై భారత్ సర్జికల్ దాడి చేస్తుందని మీడియాలో వార్తలు వస్తున్నాయి. కొన్ని టీవీ న్యూస్ ఛానల్స్ రిటైర్ అయిన ఆర్మీ అధికారులను స్టూడియోలకు తీసుకువచ్చి పాకిస్థాన్‌ని భారత్ ఏవిదంగా ఎదుర్కోవాలో చెప్పిస్తున్నాయి.
ఈ విదంగా రాజకీయ పార్టీల మొదలు టీవీ ఛానల్స్ వరకు ప్రతీ ఒక్కరూ విషాదకరమైన ఈ ఉగ్రదాడి నుంచి మైలేజ్ లేదా టీఆర్‌పీ రేటింగ్ పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. పాకిస్థాన్‌లో కూడా సరిగ్గా ఇలాగే జరుగుతుంటుంది.
ఒక విషాద ఘటన నుంచి ఇన్ని రాజకీయాలు, ఇన్ని డ్రామాలు జరుగుతుండటం చాలా బాధకరమే. కానీ ప్రపంచం ఇప్పుడు ఇలాగే నడుస్తోంది. కనుక ఇష్టం ఉన్నా లేకపోయినా తప్పనిసరిగా అన్నీ చూస్తూ ముందుకు సాగిపోవాల్సిందే!
Vijay’s son Jason Sanjay chose to make his entry into films as a director rather…
A little over two years after the previous Assembly elections, Andhra Pradesh is preparing for…