Telugu

ఉగ్రదాడులకు ట్రీట్‌మెంట్‌ ఇలాగేనా?

జమ్ము కశ్మీర్‌లో పర్యటకులపై ఉగ్రవాదుల దాడిని యావత్ దేశ ప్రజలు ముక్త కంఠంతో ఖండించారు. కేంద్ర ప్రభుత్వం కూడా దీనిని చాలా తీవ్రంగా పరిగణించి కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంది.

వాటిలో ప్రధానంగా భారత్‌-పాకిస్థాన్‌ సరిహద్దు మద్య గల వాఘా బోర్డర్ గేట్లని మూసివేసి ఇక నుంచి పాక్ నుంచి ఎవరినీ దేశంలోకి అనుమతించకూడదని నిర్ణయించారు. సార్క్ వీసా మినహాయింపు పధకం ద్వారా భారత్‌లో పర్యటిస్తున్న పాకిస్థాన్‌ జాతీయులు అందరూ వారం రోజులలోగా దేశ విడిచి వెళ్ళిపోవాలి.

ADVERTISEMENT

భారత్‌లోని పాక్ దౌత్య కార్యాలయంలో పాక్ అధికారులు, పాక్ సైనిక సిబ్బంది అవాంఛిత వ్యక్తులుగా ప్రకటన. వారి సంఖ్యని తక్షణం 55 నుంచి 30కి తగ్గించి మిగిలిన 25 మంది వారం రోజులలోగా దేశం విడిచి వెళ్లిపోవాలని ఆదేశం. భారత్‌-పాక్‌తో సింధూ నదీ జలాల ఒప్పందం నిలిపివేయాలని నిర్ణయించారు.

ఇవి కేంద్ర ప్రభుత్వం మీడియాకు తెలియజేసిన వివరాలు కాగా మరికొన్ని నిర్ణయాలు గోప్యంగా ఉంచి ఉండవచ్చు. వాటిలో పాకిస్థాన్‌పై మళ్ళీ సర్జికల్ స్ట్రయిక్ చేయడం ఒకటని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కానీ వాటిని కేంద్రం ధృవీకరించలేదు.

ఈ ఘటనపై రక్షణ మంత్రి రాజ్‌నాధ్ సింగ్‌ స్పందిస్తూ, “ఆ ఉగ్రవాదులు ప్రపంచంలో ఎక్కడ దాక్కున్నా విడిచిపెట్టే ప్రసక్తే లేదు. వారినీ, వారి వెనుక సూత్రధారులకు కూడా తగిన విధంగా బుద్ధి చెప్పబోతున్నాము. అందుకు వారు సిద్దంగా ఉండాలి,” అని తీవ్రంగా హెచ్చరించారు.

ఎప్పుడు దేశంలో పాక్ ఉగ్రవాదులు దాడులు చేసినా దేశ ప్రజలు, కేంద్ర ప్రభుత్వం, రాజకీయ పార్టీల స్పందన ఇంచుమించు ఇలాగే ఉంటుంది. కానీ ఈ సందర్భంగా కొన్ని చేదు వాస్తవాలు చెప్పుకోక తప్పదు.

ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా మోడీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక దేశంలో నిఘా, భద్రత కట్టుదిట్టం చేయడం వలన ఉగ్రదాడులు గణనీయంగా తగ్గాయి. కానీ మొన్న జరిగిన దాడి నిఘా వైఫల్యం, జమ్ము కశ్మీర్‌ రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యంగానే భావించవచ్చు.

కేంద్ర ప్రభుత్వం, నిఘా సంస్థలు, భద్రతా దళాలు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా మన దేశంలోనే పలు రాజకీయ పార్టీలు, వాటి నేతలు పాక్ పాలకులతో, వేర్పాటువాదులతో సానుకూలంగా వ్యవహరిస్తున్నందునే ఇటువంటి దాడులు జరుగుతుంటాయి.

పార్లమెంటుపై దాడి కేసు, 26/11 ముంబై ఉగ్రదాడుల కేసు, గోకుల్ చాట్ దాడి కేసులలో పట్టుబడిన దోషులు 10-20 ఏళ్ళపాటు న్యాయపోరాటాలు ఎలా చేయగలుగుతున్నారు?అని ఆలోచిస్తే ఇది అర్దమవుతుంది.

ఏది ఏమైనప్పటికీ తాజా ఉగ్రదాడి పట్ల యావత్ దేశ ప్రజలు తీవ్ర భావోద్వేగానికి లోనై ప్రతీకార చర్యలు తీసుకోవాలని గట్టిగా కోరుతున్నారు కనుక కేంద్రం కూడా అందుకు అనుగుణంగానే స్పందించిందని చెప్పవచ్చు. కానీ ఇటువంటి చర్యలతో దేశ ప్రజల భావోద్వేగాలు చల్లార్చవచ్చునేమో కానీ పాక్ ప్రేరిత ఉగ్రదాడులని శాశ్వితంగా అడ్డుకోలేవని అందరికీ తెలుసు.

కనుక దేశ ప్రజల భావోద్వేగాలు చల్లార్చడం కొరకు కాకుండా ఇప్పుడిప్పుడే కుదుట పడుతున్న జమ్ము కశ్మీర్‌లో మళ్ళీ ఇటువంటి దాడులు పునరావృతం కాకుండా అవసరమైన కఠిన చర్యలు తీసుకోవడమే చాలా ముఖ్యం. తప్పక తీసుకుంటుందని అందరికీ తెలుసు.

తొలిసారిగా ఉగ్రదాడిని జమ్ము కశ్మీర్‌ ప్రజలు కూడా ముక్త కంఠంతో ఖండించారు. రోడ్లపైకి వచ్చి నిరసనలు కూడా తెలియజేశారు. అంటే కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పలు చర్యల వలన రాష్ట్రంలో శాంతియుత వాతావరణం ఏర్పడి, తమ జీవితాలు మళ్ళీ గాడిన పడుతున్నాయనే విషయాన్ని వారు కూడా అంగీకరిస్తున్నారన్న మాట! కానీ నేటికీ జమ్ము కశ్మీర్‌లో అధికార, ప్రతిపక్షాలు పాకిస్తాన్ పాట పాడుతూనే ఉన్నాయి. అవి మానుకోవాలి లేదా మానుకునేలా కేంద్రమే చేయాలి. స్థానిక ప్రభుత్వం పాకిస్థాన్‌తో కాకుండా భారత్‌తో అనుసంధానం అయితేనే వేర్పాటువాదులు, ఉగ్రవాదులు జమ్ము కశ్మీర్‌లో అడుగు పెట్టేందుకు కూడా భయపడతారు.

లేకుంటే ప్రజల భావోద్వేగాలు చల్లార్చే ప్రయత్నాలతో సరిపెడితే ఈ ఘటనకి కూడా 22/04 అంటూ ఓ నంబర్ ఏర్పడుతుంది. క్రమంగా ఈ విషాద ఘటన చరిత్ర పేజీలలో కలిసిపోతుంది. తర్వాత మళ్ళీ మళ్ళీ ఇటువంటి కొత్త నంబర్లు మళ్ళీ పుట్టుకువస్తూనే ఉంటాయి. చరిత్ర పేజీలలో విషాద గాధలు పెరుగుతూనే ఉంటాయి.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

December 4 Clash: Nithiin vs Naga Chaitanya

Tollywood’s December release race is getting more interesting, with Nithiin’s Alias Rukmini joining the December…

8 minutes ago

First Direction, Next Acting? Jason Sanjay in the Spotlight

Vijay’s son Jason Sanjay chose to make his entry into films as a director rather…

37 minutes ago