
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ తలపతి ఆఖరి చిత్రంగా రూపొంది, పలు ఇబ్బందులు ఎదుర్కొని ఎట్టకేలకు విడుదలవుతున్న “జన నాయగన్” కోసం తమిళనాట ప్రేక్షకులు తపిస్తున్నారు. విజయ్ సీయం అయ్యాక విడుదలవుతున్న మొదటి సినిమా, అతడి ఆఖరి సినిమా కావడంతో తమిళ ఆడియన్స్ కి ఇది చాలా స్పెషల్ సినిమా.
అయితే.. తెలుగులో బాలకృష్ణ-అనిల్ రావిపూడిల “భగవంత్ కేసరి” సినిమాకి “జన నాయగన్” రీమేక్ అనే విషయం అందరికీ తెలిసిందే. నిజానికి ఈ రీమేక్ ఛాన్స్ మొదట అనిల్ రావిపూడికే వచ్చింది. కానీ.. అనిల్ తమిళ సెన్సిబిలిటీస్ కి తగ్గట్లు మార్పులు చేసేందుకు ఇష్టపడక విజయ్ పిలిచి మరీ ఇచ్చిన అవకాశాన్ని వద్దనుకున్నాడు.
ఇవాళ అఫీషియల్ గా “జన నాయగన్” జూలై 23న విడుదలవుతున్నట్లు ప్రకటించారు. అయితే.. జూలై 24న తమ సినిమాని విడుదల చేస్తున్నట్లు “చెన్నై లవ్ స్టోరీ” టీమ్ రెండు నెలల క్రితమే ప్రకటించుకున్నారు.
ఇప్పుడు జన నాయగన్ కోసం చెన్నై లవ్ స్టోరీని వాయిదా వేయాల్సిన అవసరం ఉందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఎందుకంటే.. జన నాయగన్ ను తెలుగులో దిల్ రాజు చాలా పెద్ద మొత్తం వెచ్చించి కొన్నాడు. తనకి రిటర్న్స్ రావాలంటే మాగ్జిమం థియేటర్స్ బ్లాక్ చేయాల్సిన అవసరం ఉంది.
దిల్ రాజు అలా చేస్తే.. “చెన్నై లవ్ స్టోరీ”ని రిలీజ్ చేస్తున్న మైత్రీ సంస్థ ఊరుకోదు. ఆల్రెడీ ఇరువర్గాల నడుమ పర్సంటేజ్ సిస్టమ్ విషయంలో గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఈ మైత్రీ వర్సెస్ దిల్ రాజులో ఎవరిది పైచేయి అనేది ప్రస్తుతానికి పక్కన పెట్టినా.
అసలు ఒక తెలుగు రీమేక్ సినిమా తెలుగులో డబ్బింగ్ రూపంలో విడుదలవుతుండగా.. మన తెలుగు సినిమాలు వెనక్కి తగ్గాల్సిన అవసరం ఏముంది? మన తెలుగు ప్రేక్షకులు మరీ రీమేక్ కోసం ఒరిజినల్ సినిమాలను పక్కన పెట్టేస్తారా? అనేది చర్చనీయాంశం.
మరి ఈ జన నాయగన్ ఎఫెక్ట్ ఎన్ని తెలుగు సినిమాల మీద పడుతుంది? అనేది తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.
The grand launch of the M.S. A Legacy On Screen Launch event was held at…
An Instagram reel showing a chariot procession in Lewisham, London, has gone viral. The footage…