
వాళ్లు పడుతున్న కష్టాన్ని విని చలించిపోయిన పవన్ కల్యాణ్ 5 లక్షల సాయాన్ని ఆ దివ్యాంగుల క్రికెటర్లకు అందజేశారు. “వైకల్యం అనేది ప్రతిభకు ఏ మాత్రం అడ్డంకి కాదు, దీన్ని వీరు నిరూపిస్తున్నా. ఆత్మస్ధైర్యంతో క్రీడల్లో పాల్గొనడం దివ్యాంగులందరికీ వీళ్ళు స్ఫూర్తిగా నిలుస్తున్నారు,” అని పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా అన్నారు.
మరోవైపు ఈ నెల 14 నుంచి 18 వరకూ హైదరాబాద్‌లో దివ్యాంగుల రెండో జాతీయ క్రికెట్ టోర్నమెంట్ జరగనుంది. ఈ పోటీల్లో 24 రాష్ట్రాలకు చెందిన దివ్యాంగుల జట్లు పాల్గొననున్నాయి. మ్యాచ్లు జరిగే చోటకు పవన్ కళ్యాణ్ వెళ్ళి వారిని ఉత్సాహపరిచే అవకాశం కూడా ఉన్నట్టు సమాచారం.
Yash's Toxic was sold as a pan-India and global event, but its overseas performance is…
Dulquer Salmaan's I'm Game directed by Nahas Hidhayath, is all set to hit the screens…