Telugu

పవన్ కు అంత లేదు… ఇది ఊహించిందే..!

కాస్త ఊహాజనితమే గానీ… రాజకీయాలలో ఎప్పుడు ఏదైనా జరగొచ్చు… అన్న నానుడి ప్రకారం… 2019 ఎన్నికలలో ‘జనసేన’ పార్టీ జెండా విజయపు ఎగురవేస్తే..? లేదా టిడిపి – వైసీపీల నడుమ ‘కింగ్ మేకర్’గా అవతరిస్తే… జనసేన తరపు నుండి పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రిగా చూడొచ్చా? ఊహించుకుంటే అభిమానులు ఫుల్ ఖుషీలో ఉంటారేమో గానీ, అసలు సిఎంగా తాను తగను అన్న విషయం బహుశా పవన్ కంటే మిన్నగా ఎవరికీ తెలియదని చెప్పొచ్చు.

సిఎం అంటే ఒక రాష్ట్రాన్ని పరిపాలించడం. దానికి నాయకత్వ లక్షణాలతో పాటు రాష్ట్రంలోని అన్ని శాఖలపై పట్టుండాలి. అలాగే ఎవరితో ఎలా మెలగాలో తెలిసి ఉండాలి. ఇప్పటివరకు ఇలాంటి సిఎం లక్షణాలను పవన్ లో ఇసుమంత కూడా చూడలేదన్నది వివాదానికి తావు లేని అంశం. అందుకే ‘ప్రతిసారి తనకు అధికారం ముఖ్యం కాదు’ అంటూ తనలోని నాయకత్వ లక్షణాలను పరోక్షంగా వెల్లడించుకున్నారు. మరి పవన్ కాకపోతే, ‘జనసేన’ ఎన్నికల బరిలో ఎందుకు దిగుతోంది?

ADVERTISEMENT

దేశానికి ప్రధాని మన్మోహన్ అయినా, అసలు ప్రధాని ఎవరు అన్నది అందరికీ తెలిసిన విషయమే. మన్మోహన్ పరిపాలనాదక్షతను ఉపయోగించుకుని బ్యాక్ గ్రౌండ్ లో చక్రం తిప్పిన వారి గురించి ప్రత్యేకంగా ప్రస్తావించనవసరం లేదనుకుంటా! ఒకవేళ జనసేన గెలిచినా, సేం సీన్ రిపీట్ అవుతుంది. మరి ఆ సీట్లో కూర్చునేవారెవరు? అంటే అప్పుడు రెండు పేర్లు తెరపైకి వచ్చాయి. ఒకరు మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కాగా, మరొకరు లోక్ సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ్.

అయితే… వీరిద్దరిలో కూడా కిరణ్ ముందువరుసలో ఉండడానికి కారణాలున్నాయి. ముఖ్యమంత్రిగా చేసిన అనుభవమే కాక, రాజకీయాలలో ఎవరిని, ఎక్కడ నొక్కాలో అన్న రాజకీయ శైలి కిరణ్ కు బాగా తెలుసు. అందులోనూ వర్తమాన రాజకీయ నేతలు చంద్రబాబు నాయుడు, జగన్ మోహన్ రెడ్డిల రాజకీయ జీవితాల గురించి బాగా తెలిసిన వ్యక్తి కిరణ్ కుమార్ రెడ్డి. ఇవన్నీ పరిశీలనలోకి తీసుకున్న తర్వాతే… జనసేనలోకి కిరణ్ కుమార్ రెడ్డి చేరిక వార్తలకు ప్రాధాన్యత దక్కింది.

ఇప్పటివరకు రాజకీయాలకు దూరంగా తన వ్యక్తిగత జీవనం సాగిస్తున్న కిరణ్ పై ఏపీ ప్రజలలో ఎంతో కొంత పాజిటివ్ సంకేతాలు ఉండడం జనసేనకు కలిసొచ్చే అంశంగా చెప్పవచ్చు. నాడు కాంగ్రెస్ అధినేత్రిపై పోరాటం చేసిన వ్యక్తిగా, అలాగే విభజనను అడ్డుకోవాలని కనీసం తన వంతు ప్రయత్నంగా చేసిన కృషి కిరణ్ కున్న ప్రధాన ప్లస్ పాయింట్స్. దీంతో జనసేన తరపున కిరణ్ కుమార్ రెడ్డి బరిలోకి దిగడం, కాలం కలిసి వస్తే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించడం కూడా తధ్యం అన్న టాక్ రాజకీయ వర్గాల్లో బలంగా వినపడుతోంది.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

కొండా సురేఖ స్వరంలో మార్పు…అభ్యర్ధనల నుంచి వార్నింగ్ వరకు

తెలంగాణ అధికార పార్టీ లో కొండా సురేఖ వివాదం ఆరని చిచ్చు మాదిరి అటు పార్టీని ఇటు ప్రభుత్వాన్ని ఇబ్బంది…

3 minutes ago

Dragon Release Delayed? Mythri Ravi Shankar Breaks Silence

Fans finally have a major update on Dragon, the much-awaited collaboration between Jr. NTR and…

5 minutes ago