అనిల్ రావిపూడి తప్పు చేశాడా?

“భగవంత్ కేసరి” చిత్రాన్ని తమిళంలో రీమేక్ చేస్తున్నప్పుడు, ఆ రీమేక్ ని డైరెక్ట్ చేసే ఛాన్స్ అనిల్ రావిపూడికి వచ్చింది. ఈ విషయాన్ని విటివి గణేష్ “సంక్రాంతికి వస్తున్నాం” వేదికగా చెప్పాడు. అయితే.. తన సినిమాని తానే రీమేక్ చేయడం ఇష్టం లేని అనిల్, విజయ్ రిక్వెస్ట్ చేసినా కూడా ఆ అవకాశాన్ని వదిలేసుకున్నాడు.

ఆ తర్వాత ఆ రీమేక్ “జన నాయగన్” ఏకంగా అనిల్ “మన శంకర వరప్రసాద్ గారు” చిత్రానికి పోటీగా వస్తుందని తెలిసి కొంచం ఇబ్బందిపడ్డాడు కూడా. అయితే కారణాంతరాల వల్ల సినిమా పోస్ట్ పోన్ అవ్వడంతో ఊపిరి పీల్చుకున్నాడు. ఇక ఆ సినిమాకి వచ్చిన సెన్సార్ ఇబ్బందులు, ఓటీటీ డీల్ క్యాన్సిల్ అవ్వడం వంటి వాటితో జనాలకి ఆ సినిమా మీద ఇంట్రెస్ట్ పోయింది అనుకుని లైట్ తీసుకున్నాడు.

ADVERTISEMENT

కట్ చేస్తే.. నిన్న ఎలక్షన్ రిజల్ట్స్ చూసాక మాత్రం అనిల్ రావిపూడి తప్పు చేశాడేమో అనిపించింది. ఇప్పుడు తమిళనాట మోస్ట్ ఎవైటెడ్ సినిమా “జన నాయగన్”. ఆ సినిమాకి 120 కోట్ల రూపాయల ఓటీటీ రైట్స్ క్యాన్సిల్ చేసుకున్న అమెజాన్ ప్రైమ్ సంస్థ, ఇప్పుడు ఏకంగా 150 కోట్లు ఆఫర్ చేయడానికి కూడా సిద్ధంగా ఉంది.

ఈ యునానిమస్ రిజల్ట్స్ తర్వాత “జన నాయగన్” చిత్రం ఎప్పుడు విడుదలైనా.. ఇండస్ట్రీ హిట్ అవ్వడమే కాదు, జనాలు థియేటర్లకు పోటెత్తడం ఖాయం. ఈ సెలబ్రేషన్ & తమిళనాడు మొత్తం నెత్తిన పెట్టుకొని రెస్పెక్ట్ ను అనిల్ రావిపూడి తెలిసీ తెలియక వదులుకున్నాడు.

Share
Dheeraj Babu

With over 13 years of experience in the film industry, Dheeraj Babu is a seasoned film journalist and critic known for insightful analysis and a keen eye for cinematic detail. He combines a deep knowledge of film hist…

Published by

Recent Posts

విజయ్‌ గెలిచాడా… లేక చిక్కులో పడిపోయాడా?

తమిళనాడులో గాలి తిప్పేశాడనే ఇమేజ్ వచ్చేసింది. కానీ ఫలితాల దగ్గరికి వచ్చేసరికి అసలు నిజం బయటపడింది. 108 సీట్లు పెద్ద…

19 minutes ago

Centre Clears Vizag Railway Zone, Big Boost For North Andhra

Visakhapatnam has finally crossed a major milestone with the Centre issuing the official gazette notification…

48 minutes ago