గ్లాసు పగిలింది… టిడిపి, జనసేనలకే గుచ్చుకుంటున్నాయే

జనసేన ఎన్నికల చిహ్నం ‘గాజు గ్లాసు’ సామాన్య ప్రజలు నిత్యం వాడేది కావడంతో అది వారి మనసులలో ముద్రపడిపోయింది. కనుక ఇది ఆ పార్టీకి చాలా కలిసి వచ్చే అంశం అవుతుంది. కానీ ఎన్నికల సంఘం ఆ గుర్తుని ‘ఫ్రీ సింబల్స్’ జాబితాలో పెట్టడంతో రాష్ట్రంలో అనేక నియోజకవర్గాలలో స్వతంత్ర అభ్యర్ధులకు కూడా అదే గుర్తు కేటాయించింది.

గాజు గ్లాసుని పోలిన నీళ్ళ మగ్గు, బకెట్ వంటి ఎన్నికల చిహ్నాలతోనే ఓటర్లు అయోమయం చెందితే జనసేనకు చాలా నష్టం కలిగే అవకాశం ఉంది. ఇతరులకు కూడా గాజు గ్లాసు ఎన్నికల చిహ్నంగా ఇస్తే మరెంత నష్టపోతుందో ఊహించుకోవచ్చు. దీనిపై జనసేన, టిడిపిలు ఎన్నికల సంఘానికి అభ్యంతరం తెలిపినా పట్టించుకోకపోవడంతో హైకోర్టులో పిటిషన్‌ వేసి ఎన్నికల సంఘం నిర్ణయాన్ని సవాలు చేశాయి.

ADVERTISEMENT

వాటి పిటిషన్‌ హైకోర్టు బుధవారం విచారణ చేపట్టినప్పుడు, రాష్ట్రంలో జనసేన పోటీ చేస్తున్న ఎంపీ, ఎమ్మెల్యే నియోజకవర్గాల పరిధిలో మరెవరికీ గాజు గ్లాసుని ఎన్నికల చిహ్నంగా కేటాయించబోమని రాష్ట్ర ఎన్నికల సంఘం హామీ ఇచ్చింది. ఈ వివరణతో సంతృప్తి చెందిన హైకోర్టు ఈ కేసుని ముగిస్తున్నట్లు ప్రకటించింది.

ఎన్నికల సంఘం నిర్ణయంతో జనసేనకు ఉపశమనం లభించింది. కానీ రాష్ట్రంలో టిడిపి పోటీ చేస్తున్న ఎంపీ, ఎమ్మెల్యే నియోజకవర్గాలలో గాజు గ్లాసు ఎన్నికల గుర్తుతో స్వతంత్ర అభ్యర్ధులు బరిలో దిగితే, టిడిపి నష్టపోయే ప్రమాదం ఉంది.

టిడిపి, జనసేనలు కలిసే పోటీ చేస్తున్నాయి కనుక ఆ గాజు గ్లాసు జనసేనదే అనుకొని ఓటర్లు బటన్ నొక్కకుండా ఉండరు. టిడిపి బలంగా ఉన్నచోట్ల వైసీపికి గెలిచే అవకాశం లేకపోతే దీనిని మంచి అవకాశంగా మలుచుకొని టిడిపికి పడాల్సిన జనసేన ఓట్లను స్వతంత్ర అభ్యర్ధులకు పడేలా చేసినా చేయవచ్చు.

కనుక ఆయా నియోజకవర్గాలలో టిడిపి అభ్యర్ధులు అక్కడ జనసేన పోటీ చేయడం లేదని, కనుక ఈవీఎంలో కనిపించే గాజు గ్లాసు మనది కాదని, సైకిల్ గుర్తుకే ఓట్లు వేయాలని ఓటర్లకు ప్రత్యేకంగా చెప్పుకోవలసి ఉంటుంది.

రాష్ట్రంలో ప్రధాన రాజకీయ పార్టీలైన టిడిపి, జనసేనలకు ఈవిదంగా నష్టం కలిగించే నిర్ణయాలు ఈసీ తీసుకోవడం చాలా శోచనీయం. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో పొత్తులు పెట్టుకున్నప్పటికీ, టిడిపి, జనసేనలకు ఇటువంటి ఇబ్బందులు ఎదుర్కోవలసి రావడం, వాటి కోసం న్యాయపోరాటాలు చేయాల్సి రావడం చూస్తే, బీజేపీతో పొత్తులు అవసరమా? అని అనిపించక మానదు.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Vangaveeti Radha Joins Jana Sena Ahead of AP Local Body Elections

Vijayawada leader Vangaveeti Radha Krishna has joined the Jana Sena Party after leaving the Telugu…

6 minutes ago

BSS Haindava Teaser: Breathtakingly Spectacular

Haindava, the upcoming film featuring Bellamkonda Sai Sreenivas, is an occult thriller thriller that promises…

26 minutes ago