
ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలియాలి…ఇది పవన్ అత్తారింటికి దారేది సినిమాలో డైలాగ్ అయినప్పటికీ ఇప్పటి రాజకీయాలలో జనసేన పార్టీకి, పవన్ కళ్యాణ్ కు ఈ డైలాగ్ చక్కగా సరిపోతుంది అనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. అయితే ఇప్పుడే ఇదే మాటను తన నోటితో ప్రజలకు వివరించారు పవన్.
తణుకు సభలో ప్రసంగించిన పవన్ దేశానికీ బలమైన నేత ఎంత అవసరమో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అనుభవం ఉన్న నాయకుడు కూడా అంతే అవసరం అంటూ బాబు నాయకత్వాన్ని మరోసారి బలపరిచారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రాన్ని ముందుకు తీసుకు వెళ్ళడానికి తనను, తన పార్టీని తగ్గించుకున్నానని, ఈ ఎన్నికలు 21 సీట్ల జనసేన భవిష్యత్తు కాదు ఆరు కోట్ల ఆంధ్రుల భవిష్యత్తుకు సంబంధించినవి.
వారు నెగ్గడానికి నేను తగ్గాను…వైసీపీ వ్యతిరేక ఓటు చిలనివ్వను అంటూ ఆనాడు ఇచ్చిన పిలుపుకి కట్టుబడి నా పార్టీ బలాన్ని కూడా తగ్గించుకుని వైసీపీ పతనానికి అడుగులు వేసా, మూడు పార్టీల మద్దతుదారులు ఓటు బదిలీతో కూటమి అభ్యర్థిని గెలించాలంటూ తణుకు ప్రజలకు విజ్ఞప్తి చేసారు.
5 ఏళ్లలో DSC నోటిఫికేషన్ ఇవ్వలేని వైసీపీ ప్రభుత్వం, 70 వేల కుటుంబాలకు TA , DA లు ఇవ్వలేని వైసీపీ, రక్షణ కల్పించే పోలీసు వ్యవస్థనే రోడ్డున పడేసింది. TDR బాండ్లు దోచుకుని హైద్రాబాద్ లో ఫ్యాక్టరీలు పెట్టిన ఈ మంత్రి స్థానిక రైతుల కష్టాలను ఎలా అర్ధం చేసుకోగలుగుతారు..? అంటూ అక్కడి ప్రజలను ఆలోచింపచేసారు.
వైసీపీ ప్రభుత్వంలో…బూతులు తిట్టే మంత్రులు, డాన్స్ లు చేసే మంత్రులే కానీ పాలన చేసే మంత్రులు, ప్రాజెక్టులు పూర్తి చేసే మంత్రులు కనపడరు. దానికి ఉదాహరణగా కొడాలి, అంబటి వంటి మంత్రుల ఉదంతాలను వివరించారు.
Aadarsha Kutumbam - AK47 was recently postponed again, and there is still no clarity about…
The USCIS has officially removed the 540-day automatic extension granted to H-4 visa holders with…