
ఎన్నికల వ్యూహ నిపుణుడు ప్రశాంత్ కిషోర్, ఆయన ఐ-ప్యాక్ బృందాలు సోషల్ మీడియా ద్వారానే ఎన్నికలను ప్రభావితం చేయగలిగే స్థాయికి ఎదిగాయంటే అది ఎంత శక్తివంతమైనదో అర్దం చేసుకోవచ్చు. అందుకే రాజకీయ నాయకులు, సినీ నటీనటులు కూడా దాని గురించి అవగాహన ఏర్పరచుకొని లేదా దాని కోసం ప్రత్యేకంగా సిబ్బందిని ఏర్పాటుచేసుకొంటున్నారు.
మీడియాను వాడుకోవడంలో జనసేన కూడా చాలా వెనకబడిపోయింది. కొందరు ముఖ్య నేతలు తప్ప సోషల్ మీడియాలో పెద్దగా ఎవరూ కనబడరు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సినిమాలపై సోషల్ మీడియాలో వెంటనే స్పందించే ఆయన అభిమానులు, రాజకీయాల జోలికి వెళ్ళకపోవడం ఆశ్చర్యకరమే.
అయితే పవన్ కళ్యాణ్ పీపుపు ఇవ్వగానే రాష్ట్రంలో రోడ్ల దుస్థితిని సిఎం జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్ళేందుకు #గుడ్ మార్నింగ్ సిఎం సార్ అనే పేరుతో మూడు రోజుల పాటు సోషల్ మీడియాను అభిమానులు దున్నేశారు. ఆ తర్వాత చల్లబడిపోయారు.
అయితే సోషల్ మీడియా శక్తిని, దాని ప్రభావాన్ని వైసీపీ మొదటి నుంచే బాగా గ్రహించింది. అందుకే దాని కోసం సోషల్ మీడియా విభాగాన్ని కూడా ఏర్పాటు చేసుకొని ప్రభుత్వం అమలుచేస్తున్న పధకాలు, అభివృద్ధి పనుల గురించి విస్తృతంగా ప్రచారం చేసుకొని ప్రజలకు చేరువయ్యేందుకు గట్టిగా ప్రయత్నిస్తోంది.
వైసీపీ ప్రభుత్వ మీడియా సలహాదారుగా వ్యవహరిస్తున్న సజ్జల రామకృష్ణారెడ్డిని సోషల్ మీడియా ఇన్‌చార్జ్ గా నియమించబోతున్నట్లు తాజా సమాచారం. అంటే వైసీపీ సోషల్ మీడియాకు ఎంత ప్రాధాన్యం ఇస్తోందో అర్దం చేసుకోవచ్చు. కనుక ఇప్పటికైనా టిడిపి, జనసేన నేతలు, కార్యకర్తలు సోషల్ మీడియాలో ప్రవేశించి దానిని వాడుకోగలిగితే వారికే మంచిది లేకుంటే బావిలో కప్పల్లా మిగిలిపోవలసి రావచ్చు.
Vijay Deverakonda’s Ranabaali is heading towards release with a big overseas target, but the early…
After missing its October 9 release, Venkatesh and Trivikram’s Aadarsha Kutumbam AK47 was reportedly heading…