
[m9ad]
అయితే పవన్ కళ్యాణ్ ప్రకటనపై ఇతర పార్టీ కార్యకర్తలే కాకుండా సొంత పార్టీకి చెందిన తెలంగాణ కార్యకర్తలు కూడా పెదవి విరుస్తున్నారు. పక్కనే ఉన్న సాటి తెలుగు రాష్ట్రమైన తెలంగాణలో ఎన్నికలు జరుగుతుంటే కనీసం గుప్పెడు సీట్లలో పోటీ చెయ్యలేని పార్టీ సత్తా దేశవ్యాప్తం ఎలా చేస్తారని వారంతా ప్రశ్నిస్తున్నారు.
చిన్నా చితకా పార్టీలు కూడా ఎన్నికలలో పోటీ చేస్తుంటే అశేష అభిమాన ఫాలోయింగ్ ఉండి కూడా పోటీకి వెనుకాడటం ఏంటో అని ఆ పార్టీ తెలంగాణ అభిమానులు వాపోతున్నారు. కేసీఆర్ అసెంబ్లీని రద్దు చేసిన కొత్తలో జనసేన కొంత హడావిడి చేసిన ఆ తరువాత మిన్నకుండిపోయింది. ఎన్నికల షెడ్యూల్ వచ్చినా పవన్ కళ్యాణ్ నోరు మెదపడం లేదు.
Naga Chaitanya’s upcoming mythological thriller Vrushakarma has landed a massive theatrical distribution deal, with Dil…
Tamil cinema is witnessing a very interesting passage with regard to the superstar segment of…