పవన్ పిఠాపురం పంచాయితీ…! బ్లూ మీడియాకు కావాల్సినంత ఆహారం.

ఇన్నాళ్లుగా పవన్ పోటీ ఇక్కడా..అక్కడా…ఎక్కడా అంటూ మొదలైన ప్రశ్నలకు, ఊహాగానాలకు జనసేన పార్టీ ఆవిర్బావ దినోత్సవం సందర్భంగా మంగళగిరి పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో అటు పార్టీ క్యాడర్ తో పాటుగా ఇటు రాష్ట్ర ప్రజలకు ఒక క్లారిటీ ఇచ్చారు పవన్ కళ్యాణ్.

2009 నుంచి పిఠాపురం ఎన్నికల చరిత్ర ఒక్కసారి తిరిగేసుకుంటే ఆ నియోజకవర్గంలో ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చాయో…? అందులో జనసేన, టీడీపీ బలమెంత, కాపు ఓటింగ్ ప్రభావం ఎంత అనేది ఒక క్లారిటీ వస్తుంది. 2009 లో చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం సమయంలో ఆ పార్టీ నుండి పోటీ చేసిన వంగా గీత విశ్వనాధ్ 46623 ఓట్లు సాధించి 31 .19 ఓటింగ్ శాతంతో టీడీపీ, కాంగ్రెస్ అభ్యర్థుల పై గెలుపొందారు.

ADVERTISEMENT

అదే సమయంలో టీడీపీ నుంచి పోటీ చేసిన వర్మ 45587 ఓట్లతో రెండవస్థానంలో, కాంగ్రెస్ నుంచి ముద్రగడ పద్మనాభం 43431 ఓట్లతో మూడవస్థానంలో ఉన్నారు. విజయం సాధించిన పీఆర్పీ అభ్యర్థి వంగా కేవలం 1036 ఓట్ల మెజారిటీ మాత్రమే సాధించారు. 2014 లో టీడీపీ నుండి బయటకు వచ్చి ఇండిపెంట్ అభ్యర్థి గా పోటీ చేసి 97511 ఓట్లతో 57 . 59 ఓటు శాతాన్ని తక్కించుకుని 47080 ఓట్ల తేడాతో ఘన విజయం సాధించారు.

వైస్సార్సీపీ నుండి పోటీ చేసిన దొరబాబు 50431, టీడీపీ నుంచి పివి విశ్వం 15187 ఓట్లు సాధించారు. అదే పిఠాపురంలో 2019 ఎన్నికలలో వైస్సార్సీపీ పెండెం దొరబాబు 83459 ,
టీడీపీ ఎస్వీఎస్సెన్ వర్మ 68467 , జనసేన మాకినీడి శేషు కుమారి 28011 ఓట్లు సాధించారు. ఈ త్రిముఖ పోటీలో వైసీపీ అభ్యర్థి 14992 ఓట్లతో విజయం సాధించారు. టీడీపీ + జనసేన కలిపితే 96478 ఓట్లు సాధించవచ్చని గత ఎన్నికల గణాంకాల దృష్ట్యా చెప్పవచ్చు.

అనుకున్న విధంగా టీడీపీ – జనసేన పార్టీల మధ్య ఓటు బదిలీ జరిగితే పవన్ విజయం సాధించడం ఖాయమే అనిచెప్పవచ్చు. దీనికి తోడు అధికార పార్టీ మీద వ్యతిరేకత కూడా ఈ కూటమికి అదనపు బలాన్ని తెచ్చిపెడుతుంది. అయితే ఇదంతా కూడా అనుకున్నది అనుకున్నట్టుగా జరిగే సందర్భంలోనే సాధ్యమవుతుంది. పిఠాపురం టికెట్ పవన్ ప్రకటించడంతో టీడీపీ లో అసమ్మతి రోడ్డెక్కింది.

టీడీపీ పార్టీ నుండి టికెట్ ఆశించిన వర్మ అనే బలమైన అభ్యర్థిని కాదని బాబు ఈ సీటును జనసేనకు కేటాయించడంతో వర్మ అనుచరులు రోడ్ల పై నిరసన కార్యక్రమాలు చేపట్టి టీడీపీ పార్టీ కి పార్టీ అధినాయకత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేపట్టారు. అలాగే వర్మను ఇండిపెంట్ అభ్యర్థిగా ఎన్నికల బరిలో దింపే ఆలోచనలో ఆయన అనుచర గణం ఆవేశంతో ఊగిపోతున్నారు. అసలే అవకాశం కోసం ఎదురుచూస్తున్న వైసీపీ కి, బ్లూ మీడియా కు కావలసినంత ఆహారం ఇస్తూ పిఠాపురం సీటు పంచాయితీని రోడ్డు ఎక్కించారు స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు.

టీడీపీ, జనసేన, బీజేపీ మూడు పార్టీల పొత్తు కుదర్చడానికి, దానిని ముందుకు తీసుకెళ్లడానికి పవన్ తనను , తన పార్టీ బలాన్ని తగ్గించుకుని త్యాగానికి సిద్ధమవుతుంటే ఇలా పొత్తు ధర్మానికి తూట్లు పొడుస్తూ మిత్ర పక్షాలే రోడ్డు ఎక్కితే ఇక అనుకున్న గమ్యాన్ని చేరేదెలా..? ఈ పోరాటాలతో పార్టీ కార్యకర్తలు సాధించేదిమిటి..? పొత్తులో నష్టపోయిన నేతలకు ఎన్నికల ఫలితాల తరువాత న్యాయం చేస్తానంటూ అధినేతలు చెపుతున్న వినకుండా ఇలా గగ్గోలు పెట్టి ప్రత్యర్థి వర్గానికి ఆహారం అందించడం అవసరమా..? అనేది ఒకసారి ఆలోచించుకోవాలి.

పనిలో పనిగా పవన్ పంచాయితీ అనగానే దూరిపోవడానికి, దాని పై వెటకారంగా స్పందించడానికి ముందు వరుసలో ఉండే వివాదల ఆర్జీవీ కూడా తన సోషల్ మీడియాలో ఒక ఆసక్తికర పోస్టు పెట్టారు. అసలు నాకు రాజకీయాలే తెలియవు..నాకు ఎమ్మెల్యే కు ఎంపీ కు మధ్య తేడా కూడా తెలియదు అంటూ కవరింగ్ కబుర్లు చెప్పే రాంగోపాల్ వర్మ తానూ కూడా పిఠాపురం నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా పవన్ పై పోటీ చేయబోతున్నానంటూ ప్రకటించుకున్నారు. అయితే తన ఆరాధ్య దైవం వైస్ జగన్ పార్టీ తరుపున పోటీ చేసే అవకాశం ఆర్జీవీ కి కల్పిస్తారో లేదో .

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Pan-India Craze: Telugu Stars Ignoring a Huge Fan Base?

Baahubali took South cinema to the next level. SS Rajamouli showed the industry that regional…

4 minutes ago

AP Local Polls: YCP Starting With Disaster Slogan?

Prior to the 2024 Andhra Pradesh election, YS Jagan had this coin term of Siddham.…

33 minutes ago