
తద్వారా గోదావరి జిల్లాలలో ఓట్లు చీలిపోకుండా అందరినీ ఐక్యపరిస్తే, వచ్చే ఎన్నికల ఫలితాలు తారుమారు అవుతాయని వేరే చెప్పక్కరలేదు. వైసీపీకి ఒక్క సీటు కూడా రాకూడదని చెపుతుండటం ద్వారా గోదావరి జిల్లాల ప్రజలను జనసేనపై నమ్మకం పెరిగేలా చేసుకోగలుగుతున్నారు కూడా.
ఇదేమీ ఎవరెస్ట్ ఎక్కడం కంటే కష్టమైన పనికాదని, అందరూ తలుచుకొంటే చాలా సులువుగా వైసీపీని జిల్లాల నుంచి తరిమికొట్టవచ్చని పవన్ కళ్యాణ్ చెపుతున్న మాటలు ప్రజలను ఆలోచించిపజేస్తున్నాయి.
అసలు వైసీపీని ఎందుకు ఓడించాలి?అనే ప్రశ్నకు ఒకటి కాదు వంద కారణాలు ఉన్నాయని పవన్ కళ్యాణ్ అన్నారు. నిరుద్యోగ సమస్య, పంటలకు గిట్టుబాటుధరలు లభించకపోగా రైతులు దోపిడీకి గురవుతుండటం, వైసీపీ నేతల అవినీతి,అరాచకాలు ఒకటేమిటి చాలా కారణాలున్నాయని అన్నారు. రాష్ట్ర ప్రజలు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఈ సమస్యలను ఎదుర్కొంటూనే ఉన్నారు కనుక పవన్ కళ్యాణ్ చెపుతున్న మాటలతో బాగానే కనెక్ట్ అవుతున్నారు.
ప్రముఖ న్యాయవాది తోట సుధీర్ భీమవరం సభలో జనసేన పార్టీలో చేరినప్పుడు, పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలు చాలా ఆలోచింపజేస్తాయి.
రాష్ట్రంలో వైసీపీ నేతల అరాచకాలను, వారి కనుసన్నలలో పనిచేస్తూ అక్రమకేసులు బనాయిస్తున్న పోలీసులను ఎదుర్కోవాలంటే న్యాయశాస్త్రం, చట్టాలు, కోర్టుల గురించి అవగాహన ఉన్నవారు కూడా పార్టీలో ఉండటం చాలా అవసరమని అన్నారు. ఇది నిజమని అందరికీ తెలుసు.
ఏ నియోజకవర్గంలోనైనా ప్రత్యర్ధి పార్టీలో నేతలు, కార్యకర్తలు కాస్త చురుకుగా ఉంటే వారిపై అక్రమకేసులు బనాయించడం,అర్దరాత్రి తలుపు తట్టి లేదా గోడలు దూకి ఇంట్లోకి ప్రవేశించి అరెస్ట్ చేయడం పరిపాటిగా మారిపోయింది. పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలో టిడిపి నేత అన్వర్ బాషాను అర్దరాత్రి అరెస్ట్ చేసి ఇంటి నుంచి పట్టుకుపోవడం ఇందుకు తాజా నిదర్శనంగా చెప్పుకోవచ్చు.
కనుక ఇప్పుడు టిడిపి, జనసేనలు తమ లీగల్ విభగాలను మరింత బలోపేతం చేసుకోవలసిన అవసరం ఇంకా పెరిగింది. పార్టీల కోసం పనిచేస్తున్న నేతలను, కార్యకర్తలను పార్టీలు కాపాడుకోలేకపోతే ఎన్నికల నాటికి బలహీనపడే ప్రమాదం ఉంటుంది.
పవన్ కళ్యాణ్ పర్యటన నేటితో ముగుస్తుంది. ఈ పర్యటన నూటికి నూరుశాతం విజయవంతం అయ్యిందనే చెప్పవచ్చు. అయితే తదుపరి పర్యటనలకు వచ్చేటప్పుడు పొత్తులపై స్పష్టత ఇవ్వగలిగితే టిడిపి, జనసేనలలో ఉన్న అభిమానులకు స్పష్టత వస్తుంది. అప్పుడు వారు కలిసి పనిచేయగలుగుతారు. అలాగే ప్రజలకు కూడా పొత్తులపై స్పష్టత వస్తే వారిలో కూడా ఊగిసలాటలు నివారించవచ్చు. అప్పుడే ప్రజలందరూ వైసీపీ ఒత్తిళ్ళు, ప్రభావం నుంచి ప్రజలు పూర్తిగా బయటపడగలుగుతారు.
Andhra Pradesh's municipal election campaign has barely begun, but the first day of nominations has…
Sai Dharam Tej is pinning big hopes on Sambarala Yeti Gattu. Made on the biggest…