
ఓ ఛారిటీ కార్యక్రమంలో వితరణకు అవసరమైన నిధులు సమకూర్చేందుకు జూనియర్ ఎన్టీఆర్ ‘జనతా గ్యారేజ్’లో వాడిన బుల్లెట్ ను వేలం వేయనున్నట్టు తెలిపారు. ఈ వేలం ద్వారా అభిమానులు వెచ్చించిన మొత్తాన్ని సమాజ సేవకు అందజేస్తామని చెప్పారు. ఇందుకు చేయాల్సిందంతా…’జనతా గ్యారేజ్.కామ్’ వెబ్ సైట్ లోకి వెళ్లి… వెయ్యి రూపాయలతో రిజిస్టర్ కావాలని అన్నారు.
వేలం ద్వారా దక్కించుకున్న బుల్లెట్ ను స్వయంగా జూనియర్ ఎన్టీఆర్ అందజేస్తారని యాంకర్ సుమ తెలిపింది. ఈ వెబ్ సైట్ లో లాగిన్ కావడం ద్వారా ‘జనతా గ్యారేజ్’ టికెట్లను కూడా దక్కించుకోవచ్చని చెప్పడంతో, అభిమానుల్లో మరింత ఉత్సాహం నెలకొంది. గతంలో ‘శ్రీమంతుడు’ సినిమాలో మహేష్ వాడిన సైకిల్ ని కూడా ఈ రకంగానే మైత్రీ మూవీ మేకర్స్ వినియోగించిన విషయం తెలిసిందే.
అభిమానులకు ‘జనతా గ్యారేజ్’ బంపర్ ఆఫర్!
‘రంజాన్’ సందర్భంగా కొరటాల శివ – జూనియర్ ఎన్టీఆర్ ల విడుదలైన ‘జనతా గ్యారేజ్’ సినిమా ఫస్ట్ టీజర్ లో హైలైట్ షాట్ ఏంటి అంటే… ఎన్టీఆర్ బుల్లెట్ నడిపిన షాట్ అని యంగ్ టైగర్ అభిమానులు ఇప్పటికే నీరాజనాలు పలికారు. మరి అంత నచ్చిన ఆ షాట్ లో తమ అభిమాన హీరో నడిపిన ఆ బుల్లెట్ కావాలనుకునే వారికి ‘జనతా గ్యారేజ్’ బృందం ఓ బంపర్ ఆఫర్ ని ప్రకటించింది.
ఓ ఛారిటీ కార్యక్రమంలో వితరణకు అవసరమైన నిధులు సమకూర్చేందుకు జూనియర్ ఎన్టీఆర్ ‘జనతా గ్యారేజ్’లో వాడిన బుల్లెట్ ను వేలం వేయనున్నట్టు తెలిపారు. ఈ వేలం ద్వారా అభిమానులు వెచ్చించిన మొత్తాన్ని సమాజ సేవకు అందజేస్తామని చెప్పారు. ఇందుకు చేయాల్సిందంతా…’జనతా గ్యారేజ్.కామ్’ వెబ్ సైట్ లోకి వెళ్లి… వెయ్యి రూపాయలతో రిజిస్టర్ కావాలని అన్నారు.
వేలం ద్వారా దక్కించుకున్న బుల్లెట్ ను స్వయంగా జూనియర్ ఎన్టీఆర్ అందజేస్తారని యాంకర్ సుమ తెలిపింది. ఈ వెబ్ సైట్ లో లాగిన్ కావడం ద్వారా ‘జనతా గ్యారేజ్’ టికెట్లను కూడా దక్కించుకోవచ్చని చెప్పడంతో, అభిమానుల్లో మరింత ఉత్సాహం నెలకొంది. గతంలో ‘శ్రీమంతుడు’ సినిమాలో మహేష్ వాడిన సైకిల్ ని కూడా ఈ రకంగానే మైత్రీ మూవీ మేకర్స్ వినియోగించిన విషయం తెలిసిందే.
Mrunal Thakur knows how to make tradition feel effortlessly current. Dressed in an olive-green drape…
The Supreme Court has suggested involving Indian cricketer Virat Kohli in a public awareness campaign…