Telugu

‘జనతా గ్యారేజ్’ రికార్డులకు ‘బ్రేకులు’

తొలి ఆరు రోజులకు గానూ రికార్డు స్థాయి వసూళ్లు సాధించిన “జనతా గ్యారేజ్” హవా వీక్ డేస్ ఎంటర్ కావడంతో తగ్గుముఖం పట్టింది. 50 కోట్ల క్లబ్ లోకి ఎంటర్ అయిన ‘జనతా గ్యారేజ్’ మొదటి వారం పలు రికార్డులను సొంతం చేసుకోవడంతో ఆల్ టైం జాబితాలో ఎన్నో స్థానంలో నిలుస్తుందో అన్న అంచనాలు ప్రారంభమయ్యాయి. ఫస్ట్ వీక్ కలెక్షన్స్ తో టాప్ 10లోకి ప్రవేశించిన ‘జనతా గ్యారేజ్’ కళ్ళు టాప్ 3పై పడ్డాయని యంగ్ టైగర్ అభిమానులు భావించారు.

అయితే, బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు తీవ్ర స్థాయిలో తగ్గుముఖం పట్టడంతో, ఎంతమేరకు ‘జనతా గ్యారేజ్’ వసూళ్లు చేస్తుందనేది ప్రశ్నార్ధకంగా మారింది. వినాయకచవితి రోజు వరకు వచ్చిన కలెక్షన్స్ బట్టి 80 కోట్ల క్లబ్ లో చేరుతుందని ట్రేడ్ పండితులు లెక్కలు కట్టారు. అయితే, పండగ తర్వాత రోజు కాస్త తగ్గిన ‘జనతా’ వసూళ్ళ పర్వం, నేడు బాగా తగ్గడంతో 60-70 కోట్ల మధ్యలో కొల్లగొట్టవచ్చని అంచనాలు వేస్తున్నారు.

ADVERTISEMENT

దీనికి తోడు విక్రమ్ ‘ఇంకొక్కడు’ మరియు ‘జ్యోఅచ్యుతానంద’ సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేయడానికి ఈ వారమే ముహుర్తాలు ఖరారు చేసుకున్నారు. వీటి ప్రభావం కూడా ‘జనతా గ్యారేజ్’పై పడే అవకాశాలు లేకపోలేదు. అయితే ఇప్పటికే పెట్టిన పెట్టుబడిని ‘జనతా గ్యారేజ్’ రాబట్టడంతో డిస్ట్రిబ్యూటర్లు ఊపిరి పీల్చుకున్నారు. మొత్తమ్మీద ‘జనతా గ్యారేజ్’ ఓవర్సీస్ వంటి కొన్ని ఏరియాలలో సేఫ్ ప్రాజెక్ట్ గా, కృష్ణా, గుంటూరు, ఉత్తరాంధ్ర వంటి మరికొన్ని ఏరియాలలో ‘బ్లాక్ బస్టర్’గా నిలిచింది.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

200-Episode BIG Gamble: Is YouTube Replacing Indian TV?

Ekta Kapoor is taking a major gamble with Balaji Telefilms, and this time, television is…

39 minutes ago

Mirzapur & Awarapan 2: Big Warning to Akshay and Ajay?

The box office results have become very unpredictable. Amid this, the situation of every big…

1 hour ago