
‘జనతా గ్యారేజ్ – ఇక్కడ అన్ని రికార్డులు సెట్ చేయబడును’ అంటూ అభిమానులు ఇప్పటి నుండే సోషల్ మీడియాలో సందడి చేస్తుండగా, మరో వైపు ధియేటర్ల వద్ద వెలుస్తున్న జూనియర్ ఎన్టీఆర్ పోస్టర్లకు యంగ్ టైగర్ ఫ్యాన్స్ నీరాజనాలు పలుకుతున్నారు. బైక్ పై బ్యాగ్ పెట్టుకుని వెళ్తున్న జూనియర్ పోస్టర్ కు దండలు వేసి తన అభిమానాన్ని చాటుకోగా, మరో పోస్టర్ కు హారతులు ఇచ్చి ఆహ్వానం పలుకుతున్నారు. చూడబోతుంటే… సినిమాకు ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా… ఫ్యాన్స్ ఆశిస్తున్నట్లు ‘జనతా గ్యారేజ్ లో రికార్డులు సెట్ చేసేలా’ కనపడుతోందని సినీ పరిశీలకులు కూడా వ్యాఖ్యానిస్తున్నారు.
మాస్ లో విపరీతమైన అభిమాన గణం సొంతం చేసుకున్న జూనియర్ ఎన్టీఆర్, ‘నాన్నకు ప్రేమతో’ సినిమా ద్వారా క్లాస్ ని కూడా కట్టిపడేసాడు. దీంతో ‘జనతా గ్యారేజ్’ సినిమా కోసం క్లాస్, మాస్ అన్న తేడా లేకుండా ఎదురు చూస్తున్నాయి. కొరటాల దర్శకత్వం వహించిన రెండు సినిమాలు ఆయా హీరోల కెరీర్లో అత్యధిక వసూళ్లు చేసిన సినిమాలుగా నిలవడంతో… బుడ్డోడు కెరీర్ లో “జనతా గ్యారేజ్” కూడా అదే ఫీట్ ని అందుకుంటుందని అభిమానులు గట్టి నమ్మకంతో ఉన్నారు. మరి ఆ నమ్మకానికి ఓ శాంపిల్ గా రానున్న ధియేటిరికల్ ట్రైలర్ పైనే అభిమానుల చూపులు!
Nani has big plans for The Paradise. The film is not being treated as just…
సినిమాలలో కొన్ని కథలు, ఫార్ములాలు, కాంబినేషన్‌లు సక్సస్ కావచ్చు. కానీ కొత్త ఆలోచనలు, ప్రయోగాలు చేయకుండా వాటినే పట్టుకొని వ్రేలాడుతుంటే…