
“సెప్టెంబర్ 1వ తేదీన ‘జనతా గ్యారేజ్’ సినిమా విడుదలైతే, సెప్టెంబర్ 2న తన తల్లిదండ్రుల పుట్టిన రోజు అనీ, వారిద్దరికీ 60 ఏళ్లు నిండాయని, ఈ సందర్భంగా 12 ఏళ్ల తన తపన ఎలా తెలియజేద్దామన్న ఆలోచనకు తగిన బహుమతిని ఈ సినిమా విజయం ఇచ్చిందని” జూనియర్ ఎన్టీఆర్ ఎమోషనల్ అయ్యారు. “తన పక్కన నటించే అర్హత నాకు లేకపోయినా, నన్ను ఓ తమ్ముడిలా, కొడుకులా, శిష్యుడిలా చేసుకుని, నాలోని బెరుకును పోగొట్టిన మోహన్ లాల్ గారికి శిరస్సువంచి పాదాభివందనాలు చేస్తున్నానని, ఆయన వల్లే ఈ సినిమా ఈ రేంజ్ సక్సెస్ కు చేరుకుందని” చెప్పి ఆడిటోరియంలో చప్పట్లు మారుమ్రోగేలా చేసారు.
సమంత, తాను కలిసి ఇప్పటికి నాలుగు సినిమాలు చేశామని, వాటిలో రెండు సినిమాలు తాము ఊహించిన స్థాయిని అందుకోలేదని, దీంతో సమంతతో కలిసి తాను సినిమా చేస్తే బ్లాక్ బస్టర్ రాదంటూ ఒక సెంటిమెంట్ వినపడిందని, అయితే ఫైనల్ గా… ఫైనల్ గా… తమ ఇద్దరికీ కొరటాల శివ అద్భుతమైన విజయం ఇచ్చారని అన్నారు. ‘జనతా గ్యారేజ్’ మెకానిక్ లు కేవలం సినిమాలోనే కాకుండా, సినిమా షూటింగ్ లో కూడా తమకు బలం, బలగంగా నిలిచారని సాటి ఆర్టిస్టులకు, టెక్నీషియన్లకు కృతజ్ఞతలు చెప్పారు.
‘తన తాతగారితో కలసి పని చేసిన ఎడిటర్ చంటి మామ తనకు అందించిన ప్రోత్సాహం మరువలేనని, రాజీవ్ కనకాల చేసిన జీహెచ్ఎంసీ ఎపిసోడ్ సినిమాకు వెన్నెముక లాంటిదని అంతా చెబుతుంటే, ఆ పాత్రను మా రాజీవ్ చేయడంతోనే అంతా అలా మాట్లాడుకుంటున్నారని గర్వంగా ఉందని, చాన్నాళ్ళుగా తామిద్దరం కలిసి ఆ విజయాన్ని చవిచూడడం ఆనందాన్ని రెట్టింపు చేసిందని తెలిపారు. ఇంత అద్భుతమైన సినిమాకి సరైన బ్యాక్ గ్రౌండ్ స్కోరు లేకపోతే, ఇంత ఘనవిజయం సాధ్యమై ఉండేది కాదని, అంత మంచి సంగీతం అందించిన దేవీశ్రీప్రసాద్ కు ధన్యవాదాలు తెలుపుతూ… ఇది ప్రేక్షక దేవుళ్లు అందించిన గొప్ప విజయమని, దీనిని స్పూర్తిగా తీసుకుని మరిన్ని మంచి సినిమాలు చేస్తానని తన భావోద్వేగాలను బయటపెట్టారు.
The box office results have become very unpredictable. Amid this, the situation of every big…
Allu Arjun’s Forbes India feature was meant to highlight his growing pan-India popularity. Instead, a…