Telugu

మీరు ఎంచుకున్న రాగం ఏంటి..? పాడుతున్న పల్లవి ఏంటి..?

“కింగ్” సినిమాలో త్రిష పాట పాడుతుంటే… బ్రహ్మానందం ఇచ్చే వార్నింగ్ సీన్ గుర్తుందా..! ఒక్కసారి చూస్తే ఎవరూ మరిచిపోలేరులేండి. అంతగా అలరించిన ఆ సన్నివేశం మాదిరే ఆదివారం నాడు “జవాన్” ప్రీ రిలీజ్ ఈవెంట్ నిలిచింది. సాయిధరమ్ తేజ్ హీరోగా నటించిన “జవాన్” సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను పురస్కరించుకుని హాజరైన చిత్ర యూనిట్ సభ్యులు, అతిధులు అందరూ కూడా ‘జవాన్’ రాగంను ఎంచుకుని ‘పవన్ కళ్యాణ్’ పల్లవి పాడడం విశేషం.

సరిగ్గా ఆ సీన్ లో బ్రహ్మి చెప్పిన మాదిరే… హాజరైన వారంతా పవన్ కళ్యాణ్ ‘భజన’ చేయడమే సరిపోయింది. బహుశా పవన్ అభిమానులకు ఇది వీనులవిందుగా ఉండవచ్చేమో గానీ, అటు సినిమాకు గానీ, ఇటు పబ్లిసిటీ పరంగా గానీ ఏ మాత్రం ఆకట్టుకోలేని వేడుకకగా మారిపోవడం గమనించదగ్గ విషయం. సహజంగా పవన్ భజన చేస్తే ఆ సినిమాకు ఓపెనింగ్స్ బాగా వస్తాయనే టాక్ ఇండస్ట్రీ వర్గాలలో ఉంది. దీంతో ‘జవాన్’ బృందం అంతా దాదాపుగా దానినే అనుసరించారు.

ADVERTISEMENT

మరి వారి కార్యక్రమ ఫలితం ఎలా ఉంటుందో తెలియాలంటే మరో నాలుగు రోజులు గడవాల్సిందే. మెగా హీరోగా పరిచయమైన సాయిధరమ్ తేజ్ తన నటన, అణుకువతో అన్ని వర్గాల ప్రేక్షకులకు చేరువయ్యే ప్రయత్నం చేస్తున్నాడు. ఒక రకంగా కొంతమేరకు సక్సెస్ అయ్యాడు కూడా! కానీ ఇలాంటి భజన కార్యక్రమాలు పెట్టుకుంటే మాత్రం, ఒక వర్గానికే పరిమితం కావాల్సి వస్తుందన్న విషయం ‘సాయి అండ్ కో’ పునరాలోచించుకోవాలి. ఏది ఏమైనా “జవాన్” ఓపెనింగ్స్ పైన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ప్రభావం ఎంతమేరకు ఉంటుందో చూడాలి.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Indians’ Reels in U.S. Stores: Where Is the Civic Sense?

A few Indians dancing inside Costco, Walmart or shopping malls cannot represent the entire Indian…

1 hour ago

The Paradise Has Hype, But Is It Enough?

Nani’s The Paradise has the ingredients for a big theatrical film. The Nani-Srikanth Odela combination…

2 hours ago