
ముందుగా… మెగా హీరో టీజర్ కు వస్తే… సీరియస్ మోడ్ లో సాయి చెప్పిన డైలాగ్స్ బాగున్నాయి. ముఖ్యంగా ‘దేశభక్తి అనేది కిరీటం కాదు, కృతజ్ఞత’ అనే డైలాగ్ ఫస్ట్ టైంకే కనెక్ట్ అవుతుంది. సాయి లుక్స్, థమన్ అందించిన నేపధ్య సంగీతం కూడా ప్లస్ పాయింట్స్. ఇక ప్రధాన మైనస్ విషయానికొస్తే… చిత్ర కధంతా దేశభక్తితోనే తిరుగుతుందన్న ఫీలింగ్ ను ఈ టీజర్ ఇచ్చింది. కమర్షియల్ అంశాలతో ఈ సినిమా రూపుదిద్దుకుందో లేదో తెలియాలంటే ధియేటిరికల్ ట్రైలర్ వరకు వేచిచూడాల్సిందే.
ఇక చైతూ హీరోగా నటించిన “యుద్ధం శరణం” సినిమాలో ప్రధాన హైలైట్ గా విలన్ గా నటించిన శ్రీకాంత్ లుక్ ఉందని చెప్పవచ్చు. సాఫీగా సాగే చైతూ ఫ్యామిలీ లైఫ్ లోకి శ్రీకాంత్ ఎలా ప్రవేశించాడు? దానికి చైతూ ఎలా రివేంజ్ తీర్చుకున్నాడు? అన్న థీమ్ తో రూపొందిందని టీజర్ ఫుల్ క్లారిటీ ఇచ్చేసింది. చైతూ డైలాగ్స్, ప్రొడక్షన్ వాల్యూస్, లావణ్య అందచందాలు ప్లస్ పాయింట్స్ కాగా, ఈ రివేంజ్ డ్రామాను ఎంత ఆసక్తికరంగా థ్రిల్లర్ గా తెరకెక్కించారనే దానిపైనే చిత్ర విజయం ఆధారపడి ఉంటుంది.
ఇలా కొద్ది నిముషాల వ్యవధిలో ప్రేక్షకులను పలకరించిన ఈ రెండు సినిమాలు కూడా, రేపు సిల్వర్ స్క్రీన్ పై ఒక వారం గ్యాప్ లో ధియేటర్లలో ప్రత్యక్షం కానున్నాయి. ఆగష్టు 25వ తేదీన కృష్ణ ఆర్వీ మరిముతు దర్శకత్వంలో తెరకెక్కిన చైతూ “యుద్ధం శరణం” సినిమా విడుదల అవుతుండగా, సెప్టెంబర్ 1వ తేదీన బివిఎస్ రవి దర్శకత్వం వహించిన సాయి “జవాన్” సినిమా రిలీజ్ కానుంది. టీజర్ల విషయంలో రెండూ ఒకే విధమైన టాక్ ను సొంతం చేసుకోగా, సినిమాల విషయంలో ఎలాంటి టాక్ ను తెచ్చుకుంటాయో చూడాలి.
Dulquer Salmaan is currently promoting his upcoming film I’m Game, which is also releasing in…
The success of Hanuman Ansh has once again shown the growing pull of devotional cinema.…