
2012లో ఎస్పీ అభ్యర్థిగా రాజ్యసభకు నామినేషన్ వేసిన సందర్భంగా జయా బచ్చన్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్‌లో తన ఆస్తులను 493 కోట్లుగా ప్రకటించారు. తాజా అఫిడవిట్ ప్రకారం ఆ ఆస్తులు రెండింతలయ్యాయి. ఈ మొత్తం ఆస్తిలో 62 కోట్ల బంగారు ఆభరణాలు ఉండగా, అందులో ఆమె భర్త అమితాబ్ బచ్చన్‌కు చెందినవే 36 కోట్లు ఉండడం గమనార్హం.
అలాగే 13 కోట్ల విలువైన 12 వాహనాలున్నాయి. అందులో రోల్స్ రాయస్, మూడు మెర్సిడస్ బెంజ్‌లు, ఓ పోర్చ్ కారు, రేంజ్ రోవర్‌లు ఉన్నాయి. అమితాబ్‌కు టాటా నానో కారు, ట్రాక్టర్ కూడా ఉన్నాయి. అమితాబ్ వద్ద 3.4 కోట్లు, జయా బచ్చన్ వద్ద 51 లక్షల విలువైన వాచీలు ఉన్నాయి. అమితాబ్ వద్ద 9 లక్షల విలువైన పెన్ను ఉంది. అలాగే ఫ్రాన్స్, నోయిడా, భోపాల్, పూణె, అహ్మదాబాద్, గాంధీనగర్‌లలో ఆస్తులు ఉన్నట్టు జయాబచ్చన్ తన అఫిడవిట్‌లో పేర్కొన్నారు.
From Rocky Bhai to Raya, Yash has delivered a bona fide disaster with Toxic.…
Yash's Toxic was sold as a pan-India and global event, but its overseas performance is…