
ఆహ్లాదకరమైన దేవిశ్రీప్రసాద్ బ్యాక్ గ్రౌండ్ సంగీతంతో వచ్చిన ఈ టీజర్ ప్రేక్షకులకు ఫ్రెష్ ఫీలింగ్ ను కలిగించడంలో సక్సెస్ అయ్యింది. రొటీన్ గానే ఉన్నప్పటికీ, రొమాంటిక్ సీన్స్ తో పాటు ఫ్యామిలీ సన్నివేశాలను చూపించిన ఈ టీజర్ లో బెల్లంకొండ శ్రీనివాస్ సింపుల్ లుక్, రకుల్ ప్రీత్ సింగ్ ఫ్యామిలీ లుక్ ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. బోయపాటి టేకింగ్, ప్రొడక్షన్ వాల్యూస్ ప్రతి ఫ్రేంలో కనపడతాయి.
మొత్తానికి ఫస్ట్ టీజర్ తో మంచి మార్కులే పడిన ఈ సినిమా విడుదల ఆగష్టు 11వ తేదీగా ధృవీకరించారు. బెల్లంకొండ శ్రీనివాస్ సరసన రకుల్ ప్రీత్ సింగ్, ప్రజ్ఞా జైస్వాల్, కేథరిన్లు హీరోయిన్లుగా నటిస్తుండగా, జగపతిబాబు ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. ‘సరైనోడు’ వంటి సూపర్ సక్సెస్ తర్వాత బోయపాటి దర్శకత్వంలో వస్తున్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలే ఉన్నాయి.
తెలంగాణ అధికార పార్టీ లో కొండా సురేఖ వివాదం ఆరని చిచ్చు మాదిరి అటు పార్టీని ఇటు ప్రభుత్వాన్ని ఇబ్బంది…
Pakistan have made several changes to their Test team during the England series, and former…