
చాలా రోజుల తరువాత తొలిసారిగా చేసిన ఆమె ప్రసంగం పెద్దగా ఆకట్టుకోనప్పటికీ, కొన్ని అనివార్య కారణాల వలన తన జన్మస్థలమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని, ఇక్కడి ప్రజలను విడిచిపెట్టి ఉత్తర్ ప్రదేశ్ వెళ్ళిపోయానని అందుకు ప్రజలకు క్షమాపణలు చెప్పుకొంటున్నానని జయప్రద చెప్పడం అందరినీ ఆకట్టుకొంది.
రాష్ట్ర ప్రజలకు ఆమె క్షమాపణలు చెప్పుకోవలసిన అవసరం లేనప్పటికీ క్షమాపణలు చెప్పుకోవడం, అప్పుల రాష్ట్రంగా మారిన ఆంధ్రప్రదేశ్‌ను అందరూ కలిసి మళ్ళీ స్వర్ణాంద్ర ప్రదేశ్‌గా తీర్చి దిద్దుకొందామని ఆమె చెప్పడం రాష్ట్ర రాజకీయాలలో ప్రవేశానికి తొలి సంకేతంగానే భావించవచ్చు.
అయితే రాష్ట్ర విభజన సమయంలో నెలకొన్నట్టి సందిగ్ద రాజకీయ పరిస్థితులు మళ్ళీ ఇప్పుడు ఏపీలో నెలకొని ఉన్నాయి. సీనియర్ నేతలు పురందేశ్వరి వంటివారే ప్రస్తుత రాజకీయ పరిస్థితులను చూసి ఆంటీముట్టనట్లు వ్యవహరిస్తుంటే దాదాపు మూడు దశాబ్ధాలుగా ఏపీకి దూరంగా ఉన్న జయప్రద రాష్ట్ర రాజకీయాలలో ప్రవేశించి నిలద్రొక్కుకోగలరా?చూడాలి.
Chatrapathi is set to re-release in a 4K version this year on the occasion of…
Following the terrible failure of Retro, director Karthik Subbaraj made a comeback with his indie…