
ఐఏఎస్ గా తన ప్రయాణాన్ని మొదలుపెట్టిన జయప్రకాశ్ నారాయణ రాజకీయాల మీద ఉన్న ఆసక్తి, ఆలోచనలతో సమాజానికి, వ్యవస్థకు ఏదోఒక మంచి చేయాలనే ఉద్దేశంతో తన ఐఏఎస్ సేవలను పక్కన పెట్టి లోక్ సత్తా అనే రాజకీయ పార్టీని స్థాపించారు.అయితే లోక్ సత్తా తో యువత లో మంచి క్రేజ్ సంపాదించుకోగలిగారు.
అయితే ఎన్నాళ్ళనుంచో అవినీతితో వెళ్లురుకుపోయిన రాజకీయ వ్యవస్థను…వాటికీ అలవాటు పడిపోయిన ప్రజలను మార్చలేక స్థాపించిన పార్టీని కాలగర్భంలో వదిలేసి ఒక రాజకీయ పార్టీ అధినేత గా కాకుండా ఒక రాజకీయ విశ్లేషకుడిగా మారిపోయారు జయప్రకాశ్.
అయితే మీడియా సాక్షిగా తెలుగు రాష్ట్ర రాజకీయాల పై ఎప్పుడు తన అభిప్రాయాన్ని పంచుకుంటూనే ఉంటారు. మొన్న జరిగి తెలంగాణ ఎన్నికల సమయంలో కూడా తెలంగాణ రాజకీయ విశ్లేషణలు చేసిన జయప్రకాశ్ తాజాగా ఏపీ ఎన్నికల మీద కూడా తన అభిప్రాయాన్ని, విశ్లేషణను తెలియచేస్తూ ఏపీ ఎన్నికలలో తన మద్దతు ఏపార్టీకి అనేది కూడా బయటపెట్టారు.
సంక్షేమమే పాలన అనుకుని ప్రభుత్వాలు ముందుకెళితే ఇక రాష్ట్ర ప్రజలకు మిగిలేది అప్పులు – తిప్పలు తప్ప మరొకటి కాదనేది రాజకీయ పార్టీల తో పాటుగా ప్రజలు కూడా గ్రహించాలి. అధికారం చేతికందగానే కొందరు రాజకీయ నాయకులు నియంతలుగా మారిపోయారని, వారి నుండి రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం ప్రతిఒక్కరు చేయి కలపాల్సిన అవసరం ఉంది అంటూ వ్యాఖ్యానించారు జయప్రకాష్.
ఈ నేపథ్యంలోనే వైసీపీ ప్రభుత్వంలో అప్పులు కుప్పగా మారిన రాష్ట్రాన్ని తిరిగి గాడిన పెట్టడానికి ప్రయత్నిస్తున్న టీడీపీ – జనసేన – బీజేపీ కూటమికే తన మద్దతు అంటూ ప్రకటించారు. రాష్ట్రంలో కుల రాజకీయాలు పెచ్చుమీరుతున్నాయని, వాటిని అడ్డుకోకపోతే ఇక కులకుమ్ములాటలలో కొందరు రాజకీయ నేతలు చలి కాచుకోవడానికి సిద్ధమవుతారు. అటువంటి వారిని నియంత్రించడానికి ప్రజాస్వామ్యవాదులంతా ఏకంకావాలి అంటూ పిలుపునిచ్చారు.
ఏపీ కంటే ఒడిస్సా నయమని, ఎలాంటి ఆర్భాటాలకు పోకుండా వారి ఆదాయానికి తగ్గ అప్పులు చేసుకుంటూ ముందుకెళ్తుంటే ఏపీలో ఆ పరిస్థితి లేదు. ఇక్కడ ఆదాయానికి మించి అప్పులు, ప్రచార ఆర్భాటాలు, పదవుల పంపిణీలు…ఇలా ఒక్కటేమిటి అన్ని విషయాలలో ఏపీ పరిస్థితి నానాటికి దిగజారిపోతోంది. అటువంటి వారికీ అధికారం దూరం చేయడానికి నావంతు బాధ్యత గా ఎన్డీఏ కూటమి నా మద్దతు తెలుపుతున్న అంటూ తన మద్దతుదారులకు పిలుపునిచ్చారు జయప్రకాష్ నారాయణ.
ఎన్డీఏ కూటమికి తన మద్దతు తెలియ చేసిన లోక్ సత్తా నాయకుడు జయప్రకాశ్ నారాయణకు X లో కృతజ్ఞతలు తెలియచేసారు నారా లోకేష్. ప్రజాస్వామ్యాన్ని ప్రేమించే, గౌరవించే ప్రతిఒక్కరు ఇదేవిధంగా ముందుకు రావాలంటూ పిలుపునిచ్చారు. ఏపీలో ఇప్పుడున్న రాజకీయ వాతావరణం దృష్ట్యా వైసీపీ కి వ్యతిరేకంగా ఒక్క ప్రకటన చేయడానికి కూడా ఆలోచిస్తున్న రాజకీయ మేధావులకు జయప్రకాశ్ నారాయణ తన సత్తా చాటారు అంటున్నారు యువత.
Baahubali took South cinema to the next level. SS Rajamouli showed the industry that regional…
Prior to the 2024 Andhra Pradesh election, YS Jagan had this coin term of Siddham.…