
ఎస్టేట్ లోని జయ పర్సనల్ రూమ్ లో మూడు సూట్ కేసులు పగులగొట్టిన స్థితిలో ఉన్నాయి. ఇవన్నీ కూడా ఖాళీగా ఉండటంతో… చోరీ జరిగినట్టు అనుమానిస్తున్నారు. దుండుగులు ఎత్తుకెళ్లిన వాటిలో జయ ఆస్తుల వీలునామా కూడా ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు, జయకు చెందిన ఐదు చేతి గడియారాలు మాత్రమే చోరీ అయ్యాయని పోలీసులు చెబుతున్నారు. ఈ దోపిడీకి ప్లాన్ వేసిన జయ మాజీ డ్రైవర్ కనకరాజ్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం పలు అనుమానాలకు తావిస్తోంది.
ఈ దోపిడీలో పాల్గొన్న ఒక వ్యక్తి పోలీసులకు లొంగిపోగా, మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరు ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం 200 కోట్ల విలువైన సొత్తుతో పాటు, జయ వీలునామా కూడా అపహరణకు గురైనట్టు తెలుస్తోంది. కోట్లాది రూపాయల విలువ చేసే తన ఆస్తులను తన మరణానంతరం ఏమి చేయాలనే విషయాన్ని, జయలలిత ఈ వీలునామాలో సవివరంగా రాసినట్టు భావిస్తున్నారు.
The last time, Pawan Kalyan delivered a good theatrical experience to a reasonable extent was…
Nimrit Kaur is redefining raw ethnic elegance with an earthy, unapologetically sultry photoshoot that is…