
ఓట్ల రాజకీయం కోసం మరో సారి జయలలితను క్షోభ పెడుతున్నారు పక్క రాష్ట్రంలో. ఆ వీడియోలో ఉన్నదీ జయలలితేనా అనేలా ఉన్నారు ఆమె. ఎప్పుడు చాలా గంభీరంగా పెద్ద పులిలా కనిపించే జయలలిత చాలా పేలవంగా బేలగా కనిపించారు. డబ్బు, పదవి, మందీమార్బలం ఎంత ఉన్న ఒక మనిషి చివరి దశలో ఇంతే కదా అనే జీవిత సత్యం చెబుతుంది ఆ వీడియో.
అయితే అదే వీడియోతో మళ్ళి ఓట్లు, అధికారం, తద్వారా వచ్ఛే డబ్బు కోసం ప్రాకులాడుతున్నారు. చనిపోయిన వ్యక్తి వ్యక్తిగత స్వేచ్ఛను హరించేదిగా ఉన్న వీడియోను వారసులు అని చెప్పుకుంటున్నవారే విడుదల చెయ్యడంతో సమాధిలో ఉన్న జయలలిత శోకిస్తూ ఉండవచ్చు. ఆర్.కె.నగర్ ఉప ఎన్నిక గురువారం జరగనున్న ఈ వీడియో ప్రబావం ఎలా ఉంటుందో చూడాలి.
ఒకరకంగా ఈ ఎన్నిక శశికళ వర్గానికి జీవన్మరణ సమస్య. జైలులో ఉన్న శశికళ జైలునుండే చక్రం తిప్పాలన్న, తమిళ నాట తిరిగి పవర్ లోకి రావాలన్న దినకరన్ ఈ ఎన్నికలలో గెలవడం ఎంతో ముఖ్యం. తద్వారా దివంగత జయలలిత అసలైన వారసులు మేమే అని ప్రజలు గుర్తించారు అని వారికి చెప్పుకునే అవకాశం ఉంటుంది.
టాక్సిక్ ఫెయిల్ అయినప్పటి నుంచి సోషల్ మీడియాలో కొందరి దృష్టి రాకా మీద పడింది. విడుదలయ్యాక ఈ సినిమాకూ అదే…
Hunkkaar arrives with a subject that is bound to generate discussion, and its teaser suggests…